పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కియ్యకొనెను. అంత నాతడు చేత ఖడ్గము ధరియించి యాకన్య నిద్రించు గృహమునకు జనెను. కాని యా నిద్రించు సౌందర్యరాశినిం గనినతోడనే యాతని చేతులాడక ఖడ్గము చేతినుండి జారి క్రిందబడ నాతడా కార్యమును మాని మిగుల దు:ఖముతో మరలిపోయెను. తదుపరి అమీర్‌ఖాను దుర్మంత్రము వెల్లడి కాగా రాజసతి దు:ఖమునకు మితము లేదయ్యెను.

రాజభవనమునం దంతటను దు:ఖమయముగా నున్నను కృష్ణాకుమారి ముఖమునం దెంతమాత్రమును మృత్యుభీతి కానరాదయ్యెను. ఆమె యెప్పటివలె సంతోషముగా నాడుచు పాడుచు జెలులకు నీతులను బోధింపుచు గాలము గడుపు చుండెను. నీ కూతురు విషప్రయోగమువలన జంపుమని రాణాగారికి అమీర్‌ఖా నాలోచన చెప్పెను. అట్టి నీచకృత్యము రాణాగారికి సమ్మతమగుటవలన నొక బంగారు గిన్నెలో విషముపోసి దాని నాయన బిడ్డకడకంపెను. దానిని కృష్ణాకుమారి సన్నిధికి దెచ్చిన సేవకుడి విషము మీ తండ్రి మీకొరకు బంపెను గాన దీనిని మీరు స్వీకరింపవలయునని చెప్పగా నాబాల తండ్రియాజ్ఞ శిరసావహించి యా విషపాత్ర నాభృత్యుని చేతినుండి తీసికొని పరమేశ్వరుని బ్రార్థించి తండ్రికి ధనాయుష్య సమృద్ధియగుంగాత యనియా విషము నామె త్రాగెను. విషప్రాశనానంతరమునందు సహిత మామె మరణభయము నొందక తన యిష్టదైవమును ప్రార్థింపుచుండెను. ఇంతలో నామెతల్లి శోకించుట విని యాబాల