పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణాకుమారి

ఈ వీరబాల మేవాడదేశాధిపతి యగు మహారాణా భీమసింహుని కూతురు. ఈమె 1792 వ సంవత్సరమున మేవాడదేశపు రాజధాని యగు ఉదేపూరున జన్మించెను. జాత కర్మాదిసంస్కారములు జరిగినపిదప నాబాలకు గృష్ణయని నామకరణము చేసిరి. కృష్ణయం దామెజనని కధికప్రీతి యగుటచే నామెమిక్కిలి గారాబముతో బెరుగుచుండెను. కృష్ణాకుమారి అత్యంత రూపవతిగా నుండెను. ఆమె పెరిగినకొలదిని నామెయందలి యనేక సద్గుణములచే నామె విశేషకీర్తింగనెను. ఇట్లుండగా కొన్ని సంవత్సరముల కాబాల వివాహ యోగ్య యయ్యెను. కాన రాణిగారికి గూతు వివాహచింత విశేషమయ్యెను. ఆమెయొక్క యసమాన రూపమును మృదుమధుర భాషణములును నదివరకే దేశమంతటను వ్యాపించెను. కాన జనులామెను రాజస్థానమను కొలనిలో నీమె యపూర్వ పద్మమని పొగడచుండిరి.

ఇట్టి కన్యారత్నము నే వరునకు నియ్యవలయునని భీమ రాణా మిగుల విచార సాగరమున మునింగెను. ఆయన కిట్టి చింతగలుగుట కొక కారణముకలదు. ఆకాలమునం దా రజపుత స్థానమునంగల రాజు లందరిలో ఉదేపురపు రాణాలు శ్రేష్ట కులీనులుగ నెన్నబడుచుండిరి. తమకంటె నుచ్చవంశీకులకు గన్యనిచ్చిన సరి లేనియెడల రజపూతులతో మిగుల నవమాన