పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నడుచుకొనుచుందురు. వీరందరు నిస్సంశయముగా బతివంశము వారిని నరకమునకు బంపి తామును నరకమునకు బోదురు. అట్టి దుష్ప్రవర్తనగల వనితలయినను తుదను తెలివితెచ్చుకొని పతిభక్తి గలిగి మిక్కిలి యనురక్తితో సత్కృత్యములుచేసి శాంతినివహించి వర్తించుచున్నచో మునుపుచేసిన పాపముల నుండి తొలగిపోయి పురుషునితోగూడ స్వర్గలోకమునకు బోవగలుగుదురు. అట్లు వర్తింపక పోయినను పతుల యవసానకాలమునం దయినను ఇతర చింతలేక యనుమరణము సేవచేసినపక్షమున వారికి పతి సహితముగా సద్గతి సిద్ధించును.


_______