పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మృతినొందిరి. అప్పుడు పతికి హితముగా నడుచుకొన్న సతి పతిపోయిన సుగతికి బోయెను. బతిసమ్మతికి విరోధముగా నడచుకొన్న రెండవపడతిని యముడు పోగూడదని యాటంక పరచినందున వెనుక నేనిలిచి కన్నుల నీరుపెట్టుకొని యేడువ మొదలుపెట్టెను. అది చూచి అతడు దయార్ద్రహృదయుడయి యామెను గనుగొని "పతికి సమ్మతిలేని ధర్మము సతి చేయ గూడదు. చేసినయెడల దుర్గతికి బాత్రమగును. ఇక మీద నయినను నీవు బుద్ధిదెచ్చుగొని పతికి హితములగు వానిని జేసినచో నాతనిగతి నొందగల"వని చెప్పగా నామె మరలిపోయెను. కాబట్టి పతికి సమ్మతముగా ననువర్తింపవలసినదే సతికి పరమధర్మము. అధర్మవర్తనగల వనితలు ఆసురులని, పైశాచులని రాక్షసులని చెప్పబడు మూడు తెగలవారికిని సాధారణముగా వ్యభిచారమునందనవరతమునిష్టము గలిగియుండును. వారిలో నాసురీవర్గమువారు సదా హృదయమునందు క్రౌర్యముంచుకొని యుండుట' ధనధాన్యములను నాశముచేయుట, భోగములయందు కేవలమనురాగము కలిగియుండుట, అసూయపడుట, మొదలగు దుర్గుణములుకలిగి వర్తింతురు. పైశాచికా వర్గమువారు మనసునందు క్రోధమును సాధించుట, పతిసుతులయందు ద్వేషముకలిగి యుండుట, గృహకృత్య వర్తనముల నేర్పు చాలకుండుట, కలహములయందిచ్చగలిగియుండుట మొదలగు దుర్గుణములు కలిగి నడుచుకొందురు. రాక్షసీవర్గమువారు లేశమయిన సహనము లేకుండుట, యెల్లప్పుడు కల్లలాడుట, విశేషముగా నిద్రపోవుట, సిగ్గులేక యుండుట మొదలగు దుర్గుణములు గలిగి