పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విసర్జనీయమో, ఆ ప్రకారమే పతివ్రతలకు సహితము పరపురుషసాంగత్యము సర్వదా వర్జనీయము. ఏకాంతమున నేకాసనమునందు కొమారునితోనైనను గూర్చుండుట కులభామినికి యుక్తముగాదు. ధనికుడయినను, నిర్ధనుడయినను, రూపవంతుడయినను, రూపహీనుడయినను, వివేకియయినను, అవివేకియయినను, రోగియయినను, నిరోగియయినను, మరి యెట్టివాడయినను చేపట్టిన పెనిమిటి విషయమున లేశమయిన పొరపొచ్చెములులేక మిక్కిలి మచ్చిక గలిగి యనువర్తింపవలసినది భార్యకు ముఖ్యధర్మము. భర్త తన కేమిచ్చినను మిక్కిలి సంతోషపడవలెను గాని చాలదని యెప్పుడును దు:ఖపడ గూడదు. పతి తెచ్చియిచ్చిన వస్తువులను పదిలముగా దాచియుంచి మరల నాత డడిగినప్పుడు నిష్కపటముగా నిచ్చివేయవలయును. బలిభిక్ష మెప్పుడును దప్పక పెట్టుచుండవలెను. దేవ పితృపూజా కాలములయందు దన పతికి ననవరతము శుభములు గలుగునట్టుగా ప్రార్థింపవలెను. పతి యనుమతిలేక దేవతలనుగాని, పితరులనుగాని, యతిథులనుగాని పూజింపరాదు. పూజించినచో నది సద్గతి నొంద నేరదు. ఈ విషయమున పార్వతీదేవి చెప్పిన యితిహాసముచెప్పెదను - పూర్వమొక బ్రాహ్మణున కిద్దరు ముద్దియలు గలరు. వారిలో నొక్కతె తన పెనిమిటి యనుమతి ప్రకార మడకువ గలిగి నడచుకొనుచుండెను. మరియొక్కతె స్వతంత్రతను వహించి తన యిష్టప్రకారము పితృదేవతాతిథిపూజలను జేయుచుండెను. కొంతకాలమునకు పిమ్మట విధివశమున వారు మువ్వురును నొక్కపర్యాయమే