పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సన్నికల్లు మిషమున నహల్యను కన్యచేత ద్రొక్కించుటయు, నరుంధతీదేవి నగుపరచి భక్తిపూర్వకముగా మ్రొక్కించుటయు వాడుకగానున్నది కాదా? చక్కగా బాతివ్రత్యము నొక్కటిని గాపాడుకొన్నచో బహు విధములయిన యుపవాసాది వ్రతములతో బ్రయోజనము లేదు. పాతివ్రత్యరక్షణ మొక్కటే పడతులకు పరమోత్కృష్ట వ్రతమని ధర్మశాస్త్రములు విధించుచున్నవి. దేవతాచార్యుని భార్యయైన తారాదేవి బుద్దిమాంద్యముచేత చంద్రునితో వ్యభిచరించినందున గదా శాశ్వతమైన నింద ననుభవించుచున్నది? చేడియలతో గూడి జలక్రీడసలుపు చున్న చిత్రరథుని జూచి భ్రమసినందునగదా రేణుకాదేవి తన పాతివ్రత్యమును భంగము చేసికొని యిసుకతో గుండనుచేయలేక తుదకు రట్టుపడి పరశురామునిచేత ఖండింపబడినది? ద్రౌపదీదేవిని కర్ణునియందు గన్నిడినందునగదా తపోధనున కుపయోగపడు ఫలమును వృక్షమున కెక్కింపలేక సిగ్గుపడినది? కాబట్టి యత్నపూర్వకముగా పాతివ్రత్యమును రక్షించుకోవలసినది స్త్రీలకు ముఖ్యకర్తవ్యము. మృతులయినవారిని మరల బ్రతికింపవలెనన్నను, హరిహరబ్రహ్మలను రక్షించవలెనన్నను, భుతముల నెల్ల దలక్రిందులుగా జేయవలెనన్నను పతివ్రతల కొక లక్ష్యముగాదు. పాతివ్రత్యము బ్రహ్మనిష్ఠతో సమానమని పెద్దలు పలుకుదురు. సర్వోత్కృష్టమగు బ్రహ్మనిష్ఠ పురుషులకు జిత్తశుద్ధినిగలిగించి, పూజ్యమగు మోక్షసామ్రాజ్యము ననుగ్రహించునట్టే పాతివ్రత్యము సతులకు పరమపదము నొనగూర్చును. ఏకపత్నీవ్రతులగువారికి నన్యస్త్రీ సహవాసమెట్లు