పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీయక చంద్రమతిదేవి రక్షించుకొన్నది గాదా? రేణుకాదేవి యిసుకతో గుండనుజేసి జలమును దెచ్చినది గాదా? బృంద తన భర్తవలె ననువర్తింపవచ్చిన విష్ణుమూర్తియొక్క మాయను దెలిసికొన్నది గాదా? అనసూయాదేవి నారదులిచ్చిన యినుప సెనగలను బొరుగులగునట్టు వేచినది కాదా? ఆమెయే బ్రహ్మ విష్ణుమ హేశ్వరులను తనకు బిడ్డలనుగా జేసికొన్నది కాదా? అరుంధతీదేవి యిసుకను నిమిషములో వండినది కాదా? లక్ష్మీదేవి పరమశివుని బట్టుకొన్న బ్రహ్మహత్యను వదలగొట్టినది కాదా? పార్వతీదేవి పరమేశ్వరుని యర్థాంగమును సంపాదించుకొన్నది గాదా? ఇటువంటి మహత్వమంతయు వారికి బాతివ్రత్యము వలననే గదా కలిగినది. చూడుము; అరుంధతీదేవి తక్కువ జాతిలో బుట్టినదయ్యును తన పాతివ్రత్యముచేత సప్తర్షిమండలమున వసిష్ఠులవారి దండను నిండుకాంతితో వెలయుచు లోకమునకు కన్నులపండువు చేయుచున్నది. ఒక్క పర్యాయము మునిపత్నులమీది మోహముచేత మిక్కిలి యార్తిజెందిన తనభర్తయగు అగ్ని హోత్రునియొక్క యిష్టాపూర్తి చేయునిమిత్తమయి స్వాహాదేవి తన మాహాత్మ్యమువలన ఆర్గురు ఋషి పత్నులరూపము దాల్చియు, పరమ పవిత్రురాలన్న హేతువు చేత నరుంధతీదేవి రూపము మాత్రము ధరించుటకు శంకించినది గాదా? సత్కులప్రసూతయు, సకల సంపన్నయు నయిన అహల్యాదేవి మనోవైకల్యముచేత పాతివ్రత్యమును పాడుచేసు కొన్నందుననే గదా పాషాణమయి పడియుండి చిరకాలము దు:ఖ మనుభవించినది? ఇప్పుడును వివాహసమయములయందు