పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సతికి సర్వశుభములును సులభముగా సిద్ధించును. పాతివ్రత్యమునకన్న నుత్తమమయిన వ్రతము మరేదియును లేదు. లోకమునంగల జప తపో నియమాదు లేవియు బాతివ్రత్యమునకు సమానములు కావు. పాతివ్రత్యమును బాడుచేసికొనక మిగుల జాగ్రత్తతో గాపాడుకొన్న గుణవతి భాగీరథీ యనబడును. పాతివ్రత్యముగల వనితకు పరమపద మరచేతిలోనిదని పెద్దలు పలుకుదురు. పాతివ్రత్యమును రక్షించుకొన్న వనితలకు నే లోపములును రావు. పాతివ్రత్యమునకు భంగము కలిగించు కొన్నచో బహువిధములయిన బాధ లనుభవింపవలసివచ్చును. ప్రాణమునకంటె పదిమడుగు లెక్కుడుగా బాతివ్రత్యమునందు బ్రీతికలిగి కాపాడుకోవలసినది. భూషణముల కెల్ల భూషణము పాతివ్రత్యమే సుమీ! పాతివ్రత్యమునకంటె బడతులకు బాలింప వలసిన పదార్థ మొక్కటిలేదు. పాతివ్రత్యమును బాడు చేసికొనిన పాపాత్మూరా లొకవేళ సత్కర్మములను జేసినను అవి దుష్కర్మములక్రింద మారి తుదకు దు:ఖమును కలిగించును గాని లేశమయినను సుఖమును గలిగింపవు. పతివ్రతలయొక్క ప్రభావముచేతనే భూతలమంతయు నంతరమున నిలిచియున్నదనియు, పతివ్రతల విషయమున బ్రహ్మాది దేవతలు సహితము భయపడుచుందురనియు పెద్దలు పలుకుదురు. పూర్వము మృతి నొందిన తనపతిని సావిత్రిదేవి మరల బ్రతికించుకొన్నది కాదా? తన చిత్తశుద్ధిని దెలుపుటకై సీతాదేవి యగ్నిలో దుమికినది గాదా? తనకు హాని చేయవచ్చిన కిరాతుని దమయంతీదేవి భస్మముచేసినది గాదా? తన మాంగల్యము నితరులకు దెలియ