పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరచి భార్యాభర్త లెడబాయకుండ జేసెను. తదనంతరము పద్మావతీ జయదేవులు కాశీక్షేత్రమున కరిగి, యచటి పురుషులకు భక్తియు స్త్రీలకు పాతివ్రత్యమును ఉపదేశింపుచు తమ ప్రవర్తనవలన వారికి దారి జూపుచుండిరి. కొంతకాల మచట నుండి స్వగ్రామమునకు బోయి యచ్చటనే కొన్నిరోజులకు వారు కాలధర్మము నొందిరి.

పద్మావతీదేవి రాజుభార్య కుపదేశించిన యుపన్యాస మొకటి యాంధ్రమహాభక్త విజయమునందు గానుపించుచున్నది; గాని మహారాష్ట్ర భక్తవిజయమునందు లేదు. ఆంధ్రభక్తవిజయ కారుడీ యుపన్యాసము నెచ్చటినుండి సంగ్రహించెనో తెలియదు. అయినను నా యుపన్యాసము స్త్రీలకు బాతివ్రత్యంబు గరపుటకు నత్యంతోపయుక్తముగా నుండుట వలన దాని నిట బొందుపరచుచున్నాను.

"అమ్మా! లోకములో సతులకు ముఖ్యముగా గావలసిన ధర్మ మొక్కటిగలదు. పతికంటె వేరు దైవముగాని, పతికంటె వేరు గతిగాని, పతికంటె వేరు చుట్టముగాని, పతికంటె వేరు సంపదగాని, పతిసేవకంటె నుత్కృష్టమగు పూజగాని, పతి యనుమతి ననుసరించుటకంటె పరమసాధనముగాని లేదనియు, పాతివ్రత్యమున కెప్పుడును భంగమురాకుండ కాపాడు కొనుచుండుటే బ్రహ్మజ్ఞానమనియు, పతినామము ననవరతము సంస్మరించుటే బ్రహ్మధ్యానమనియు, పతి నెడబాయకుండుటే బ్రహ్మానందమనియు, పతి మృతినొందిన తోడనే ప్రాణములు విడుచుటె మోక్షమనియు నిశ్చయించుకొని వర్తించుచున్న