పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండెను. జయదేవుడు పీయూషవర్షుడగు కవియని ప్రసిద్ధి గాంచెను. ఆయన సాహిత్యసంగీత విద్యలయం దసమాన పాండిత్యము గలవాడై ప్రసన్న రాఘవ మనునాటకమును గీత గోవిందమను సంగీతగ్రంథమును రచియించెను.

ఇట్లా దంపతులు సుఖముగా నుండి గొన్నిదినంబుల కొకయూరి సాహుకారు జయదేవుని మిగుల వేడుకొని సమీపమునందున్న తనగ్రామమునకు గొనిపోయెను. జయదేవుడచట గొన్నిదినంబులుండి యాగ్రామమునం దంతటను ననేకులను భక్తులనుగా జేసెను. తదనంతరమాయన స్వగ్రామమునకు బ్రయాణమగుట గని యాషాహుకా రాయనకు దెలుపక గుప్తముగా నాబండియడుగున కొంతద్రవ్యము నునిచియింటి కేగిన వెనుక పద్మావతిగారి కిమ్మని తనబంటగు బండితోలు వానితో జెప్పెను.

ఇట్లు బయలుదేరి జయదేవులు కొంతదూర మరిగిన పిదప నతనిబండిలో ధనమున్నసంగతి యరణ్యవాసులగు దొంగలకు దెలిసి వా రాబండిని నాపి సకలధనమును దోచుకొని జయదేవుని వదలి దమకు నతడు రాజభటులచే నపాయము చేయించునని తలచి, కాలు సేతులు కట్టి జయదేవులను నొక పాడునూతిలో బారవేసిరి. అందుపై గొంతసేపటికి క్రౌంచ దేశాధీశ్వరు డచటికి వేటాడవచ్చి జయదేవునిగని తన నగరమునకు గొనిపోయెను. అచట రాజవైద్యులచే ననేకౌషధోపాయములు చేయించగా జయదేవుల కాలు సేతుల గాయములు మానెను. జయదేవుల యసారపాండిత్యమును, నిర్మల