పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కదా ఆర్య స్త్రీ సంతతిలోని వారమను గౌరవబిరుదమును మన స్త్రీలోకమునకు నిల్పువారు!

ఈమె యందు స్వదేశప్రీతి మెండుగా వాసము చేయుచుండెను. ఈ గుణమింత జాజ్వల్యముగా బహు కొలది పురుషులలో నుండును. స్వదేశ వేషభాషలను మాని పరదేశ వేషభాషల నాదరించువారీ నారీమణికి హృదయ శల్యములవలె దోచుచుందురు. చదువుకొని కొలది స్వదేశాభిమాన మధిక మగుచుండవలెనని యీమె తన చెలులకు శ్రద్ధతో బోధించుచుండెడిది. ఈయరు తన "అబలా సచ్చతిత్ర రత్నమాల" లో నొక విదుష్టీచారిత్రమును వ్రాయుచు నా చరిత్ర నాయికకుగల స్వదేశప్రీతి నిట్లు కొనియాడియున్నది. "కొందరు పురుషులు గాని, స్త్రీలుగాని తమ దేశమును వదలి పరదేశమున కేగిన పిదప దమ దేశాచారముల విడచి యా దేశాచారములనే స్వీకరింతురు. కాని మా చరిత్రనాయిక యట్లుగాక పాతాళలోకమున కరిగియు దన దేశాచారములను మరువక యా దేశపువారికిని వానిని నేర్పెను! ఆమె తన స్నేహితురాండ్రకును, కార్పెంటరు నింటివారికిని మహారాష్ట్ర స్త్రీలవలె జడలు వేసి చీరలు కట్టింపుచుండెను! తాను న్యూజరసీ పట్టణమున కేగుటకు ముందు తన స్నేహితురాండ్ర కందరకును మహారాష్ట్ర పద్ధతి ననుసరించి విందు చేసెను. ఆ దిన మామె తానే తనదేశపు పక్వాన్నములువండి భోజనములకు గూర్చుండుటకు బీటలు వేసి, తినుటకు విస్తరులును దొప్పలును గుట్టి మహారాష్ట్ర దేశాచార ప్రకారము సకల పదార్థములును వడ్డించి విందారగింప వచ్చిన యువతులకు మహారాష్ట్ర స్త్రీలవలె జీరలు, గాజులు, గుంకుము మొదలైన వలంకరించి చేతితో భోజనముచేయు విధమంతయు వారికి దెల్పి తానును వారితో గూర్చుండి భోజనము చేసెను."

చూచితిరా యీమె స్వదేశాభిమానము! ఈ స్వదేశభక్తిపరాయణ యొకచో శ్రీమతి కొటికలపూడి సీతమ్మగారి 'లేడీ జేన్‌గ్రే' యను గ్రంథమును గూర్చి "ఈ కవయిత్రి హిందూదేశము నందలి నారీరత్నములలో నొక స్త్రీని గావ్యనాయికగా దీసికొని, కావ్యము రచించిన యెడల నది హిందువులకు విశేష ప్రియమగునని నా యభిప్రాయము" అని వ్రాసియున్నది. ఈమె స్వదేశములో జేసిన వస్తువులనే గాని, సాధ్యమైనంతవరకు బరదేశములో జేసిన