పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లీలావతి

ఉ. వింతగ వాదమేల యవివేకుల పోలిక? స్త్రీలవిద్య సి
   ద్ధాంతమె చేసివారు మన తజ్ఞులు పూర్వులు - (వీరేశలింగకవి)

గణితశాస్త్ర పండితుడని ప్రసిద్ధి గాంచిన భాస్కరాచార్యుల కొక కూతురుండెను. ఆమె పేరు లీలావతి. సిద్ధాంత శిరోమణియందు భాస్కరాచార్యులవారు తానా గ్రంథము 1072 వ శాలివాహన శకసంవత్సరమునందు రచియించితినని వ్రాసినందున లీలావతి 12 వ శతాబ్దమున నుండినట్టు తేలుచున్నది. లీలావతి బాలవితంతు వైనందున నామె భర్తృవంశ మేదియో తెలియదు. మన దేశమునందు జరిత్రములు వ్రాసియుంచు పద్ధతి పూర్వమునుండి లేనందున గణితశాస్త్రమునం దసమానపండితయైన లీలావతిని గురించి కొన్ని సంభవాసంభవములగు కథలు దప్ప చరిత్రమున కితర సాధనంబు లేవియు లేనందున నా దంతకథలే యిచ్చట వ్రాసెదను. భాస్కరాచార్యులవారు జ్యోతిషమునందు మిగుల ప్రవీణులు. కాన లీలావతికి వైధవ్యము ప్రాప్తించునని జాతకమువలన దెలిసికొనెనట. అందువలన భాస్కరాచార్యులు పూర్ణాయువుగల వరుని వెదకి తెచ్చి, యొక మంచి ముహూర్తమునందు లీలావతికి వివాహము చేయ నిశ్చయించిరి. వివాహమునకు బూర్వము చేయవలసిన విధులజరిపి, కన్యావరులను మండపమునందు గూర్చుండ బెట్టెను. ముహూర్తము తెలియుటకై నీటిలో ఘటికాయంత్రము (సన్న చిల్లిగల గిన్నె) నొక దాని నునిచి, పురోహితసమే