పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డగుటకై రారాజుకుందగినడంబముతోగూడి రూపనగరమునకు బయలుదేరెను. ఔరంగజేబు రాకడ విని విమలదేవి డెందమున మిగులగుంది చచ్చుటకు నుంకించునంతలో రాజసింహుడు వచ్చి యామెను చేపట్టి మరల తన సీమకు దీసికొనిపోవ దొడగె. ఇట్లు పోవుచు నొకప్పుడు గొన్ని కొండల నడుమకు వచ్చిరి. అప్పు డచట వారు కొంతసేపు డప్పి దీర్చుకొనుటకై కూర్చుండిరి. అచ్చటికి గొంచెము దవ్వుననే ఔరంగజేబు తన మూకలతో విడిసియుండెను. అప్పు డౌరంగజేబు నాతియు విమలదేవి యక్కయు నగు కేసరిబాను ఒక చెంచువా డెట్టులనో పట్టుకొని తెచ్చి వీరు దిగిన కొండత్రావునందొక పొదచాటున నుంచెను. అప్పుడామె "నన్నెవరయిన గాపాడు"డని యా కారడవిలో మొరపెట్టగా విని విమల తన మగని నంపగా నా రాచపట్టి యా చెంచువాని చేతినుండి కేసరిబాను విడిపించి తన యింటియొద్దికి దీసికొని వచ్చెను. కేసరిబా చెల్లెలి మొగముచూడ సిగ్గుపడి యామె తనకు జేసిన సాయమునకు గరంబు సంతసించి తాను విమలకు జేసిన యెగ్గునకు దన్ను మన్నింపుమని చెలియలిని వేడుకొనియెను. అప్పుడు విమలదేవి తన యక్కను వెరవవలదని చెప్పి కొందరు బంటుల వెంటనిచ్చి యామెను ఔరంగజేబువద్ద కంపెను. కేసరిబా చెప్పగా ఔరంగజేబు జరిగినకత యంతయు విని రజసింహునిపై గల పగమాని డిల్లీకిబోయెను. రాజసింహుడును నెలతతో ఉదోపురమున కరిగి సుకంబుండె.


_______