పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుసురులు బొంది విడిచిపోయినను తురకల చెట్టబట్టక మేటి మగండగు రజపూత పుడమిఱేని బెండ్లియాడెదననియు బ్రతిన బట్టెను. అందుకామె యక్క నిన్ను దురకల కిప్పించికుండిన నేను ఔరంగజేబున కింతినేకాను" అని డిల్లీకరిగి తన మగని కా కత యంతయు జెప్పి యతనిచే విమల నిమ్మని తన తల్లిదండ్రులకు జాబు వ్రాయించెను.

విమలదేవియు దాజేసిన ప్రతిన తల్లిదండ్రులకు జెప్పగా వారు మెచ్చి యామెను గొనియాడిరి. కాని ఔరంగజేబు వద్దనుండి వచ్చిన జాబును చూచుకొనినపిదప వారు మిగుల వెరచి విమల నతని కియ్యదలచిరి. దీనింగని విమల మిక్కిలి నొగిలి సిసోదియా రాచకులంబున బుట్టిన రాజసింహుడు నాబరగు రాచకొమరుని బీరమ్ము నదివరకు వినియున్నది గాన నతనికొక జాబువ్రాసి తమ యొజ్జలచేత నతనికి బంపెనా ఆ జాబులో నామె 'ఆడయంచ కాకికి నాతియగుట దగును.? దోసమెరుగని దొరకులంబున బుట్టిన కన్నియ కోతిమూతి వాడును బోడితలవాడును నైన తురక గూడుట యింపగునా? వెన్నుడు రుక్మిణిం దీసికొనిపోయినటుల నన్ను గొనిపొండు. మీ రొక వేళ నన్ను గాపాడకుండిన నేను నా మేనుం జాలించెదను. ఇది నిజము' అని వ్రాసెను. ఈజాబుంగొని చనిన పుడమివేల్పు విమలయొక్క మంచి గొనముల నా రాచ సింగంబునకు జెప్పగా నతడు తురకలపై కరంబలిగి గొప్ప దండుతో రూపనగరమునకు బయలుదేరెను. ఈలోపల బెండ్లిమూర్తము దగ్గర వచ్చినందున నౌరంగజేబు పెండ్లికొమారు