పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్పుడు మనల ననుసరించియే యున్నది. కాబట్టి వాని రాకకు ప్రతి మనుష్యుడును నిరీక్షించియే యున్నాడు. ఏదియయిన నొక యుత్కృష్టమైన పనియొక్క ఫలిత మనుకూలముగా నుండెనా, దానిని పూనికతో నెరవేర్చినవారి పరిశ్రమమును ఘనముగా ప్రశంసింతుము. లేక యది ప్రతికూలముగా పరిసమాప్తి నొందెనా తత్కార్యవాహుల యవజ్ఞతను నిందింతుము. ఈ తీరుననే యదృష్టము మారి, ఫలము విఫలమైనచో లోకమది యవివేకమని చాటుటకు సిద్ధమయి యుండును.

ఇంకకొందరు కూపస్థమండూకములవలెనింటి నంటిపెట్టు కొనువారే సుఖభోగు లందురు. కాని, వారికి సుఖభోగమేలాగున గలుగునో తెలియదు. అది కోరినప్పు డనుభవింప దగినట్టు సిద్ధముగా నమర్చబడియున్న పదార్థము కాదుగదా? కొందరికి నూతనప్రియత్వ మెంత యధికముగా నుండుననగా సౌఖ్యమయినను నెడతెగనిదిగా నుండిన దానియందు రుచిలేదని వారప్పుడప్పుడు కష్టములను గోరుచుందురు. విదేశమున కేగుట చెడుపనిగాదు. కొన్ని యంశములనుబట్టి యొక్కచో నివసించియున్న దానికంటె మేలయిన పనియని చెప్పవచ్చును. దేశాటనమున నాయాదేశములయొక్కయు, ప్రజలయొక్కయు స్థితిగ్తులు బాగుగ మనసున బట్టగలవు. అట్టివాని దెలిసికొనుటయందు విముఖులమయి యుండగూడదు. అవజ్ఞతను మనము బుద్ధిపూర్వకముగా నవలంబించుట యనునది గొప్పదోషములలో నొకటి. విదేశయాత్రలం గావించుటచే మనకు బుద్ధివికాసము, జ్ఞానాభివృద్ధియు నగుటయేకాక యంతరించిన