పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/175

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని యెద్దియేని యొక కార్యము చేయబూనినప్పుడు తొలుత మేలెంచెదరుగాని కీడెప్పుడు నెంచరు. ఒకానొకప్పుడు తప్పక కీడులు మూడి మగవారినిగాని, యాడువారినిగాని భూమిలోని కడగ ద్రొక్కినయెడల నింకప్పుడు వృధా చర్చలతో బనియేమి? అవి వచ్చినప్పు డనుభవించి తీరవలసినదే కాని యా యాపదులు రాబోవు నన్నప్పుడుండెడి బాధకంటె వాని ననుభవించునపుడుండెడిబాధ యల్పమనుట జగద్విదితమే. ఏవిధమున నయినను ఈ లోకమున శాశ్వతమయిన సుఖమును బడయగలమా యనుశంకను నివృత్తి చేసుకొనుట కీ ప్రపంచము మన కవకాశ మెన్నడును గలుగజేయనేరదు. కాని పయికగుపడుచున్న సాధనముల యంతరములను దగిన సౌఖ్యమును మనుజు లెల్లప్పుడును బొందుచుండుట లేదని మాత్రము మనము చెప్పవచ్చును. ఆ సౌఖ్యమనునది కొందరు చేరి తమలోతాము విభాగించుకొన దగిన పదార్థముగాను, అది మన మనసునుబట్టి యుండును. దురవస్థలలో కెల్ల మరణమే గొప్పదని యెంచెదమంటిమా కొందరు దాని రాక కేల సంతోషింతురు? మరికొంద రేల దు:ఖింతురు? వేయేల? మృత్యువును దుర్దశయును, మంచివారికిని, చెడ్డవారికిని, పుణ్యాత్ములకును, పాపాత్ములకును, భాగ్యవంతులకును దరిద్రులకును, దేశదిమ్మరులకును గృహస్తులకును సమానముగనే వచ్చుచుండును. ఆపత్ క్షామమున నందరు వివశులగుటయు, కక్ష్యావేశముచే నెవ్వరు ప్రతిభావంతులు గాకుండుటయును సుప్రసిద్ధమే. రానున్న విపత్తు నెంతటి మనుజుడైన నడ్డగింపలేడు. ఆపదయును, నెల్ల