పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నా యాచార వ్యవహారముల యందుగాని, ఆహార విహారములలోగాని, వేష భాషలయందుగాని మార్పుగావింప నేనెంతయు దలంపలేదు. హిందూయువతిగనే పోయి, మరల హిందూ మానవతిగనే వచ్చి, యిక్కడ హిందూ సుందరులతోనే గలసి యుండ నిశ్చయించితిని. ఇప్పు డున్నదానికంటె భిన్నముగా నుండక నా పూర్వులెట్లు సామాన్యముగ జీవించిరో నేనునట్లే యుండగలదానను. ఇప్పగిది నేను బ్రవర్తించునప్పుడు అస్మద్దేశీయులు నన్ను బహిష్కరింప జూతురేని, యప్పుడేల? ఆపని యిప్పుడేచేయరాదా? అందుకు వారికి సర్వస్వాతంత్ర్యము గలిగియే యూన్నది. మా మహారాష్ట్రకుటుంబ మొక్కటియై నను లేని యీ బంగాళాదేశమందలి యీ స్థలమున నేనిప్పుడు వాసము చేయుచుంటిని గదా! నేనియ్యెడ నా దేశాచారధర్మముల ననుష్ఠించి ప్రవర్తింపుచుంటినో లేదో యెవ్వరెరుగుదురు? కాబట్టి యెన్నడును సంబవింపగూడనట్టియు, సంభవించినప్పుడు మానుషప్రయత్నములకు లోబడనట్టియు వానిని గురించి చింతింపక యుండుటయే యుత్తమము.

5. నా కేది యయిన నిక్కట్టు తటస్థించిన నే నేమి చేయుదుననెడి ప్రశ్నకు సదుత్తర మేమన్న:- కొందరు మనుష్యులు ప్రపంచములో గనబడుదానికంటె నతి భయంకరముగా గ్రంథములలో గనబడు దురవస్థలను, దుర్దశలను నుదాహరణముగా జూపి భయము నతిశయింపజేయ బ్రయత్నింతురు. కాని యా యాపదలెంత భయంకరములో యంత యరుదుగా సంభవించునట్టుగ విధింపబడియున్నవి. పురుషులుగాని, స్త్రీలు