పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొంద రెగతాళిజేయ నారంభించిరి. కొందరు కడుపుబ్బ నవ్వజొచ్చిరి. తక్కిన గృహస్థులు డాంబికముగా తమతమ పంచలలో గూర్చుండి నన్ను గని వికృతాలాపము లాడుచు నాపైని రాళ్ళు రువ్వుట కెంతయు లజ్జింపరైరి. ఇక నంగడివాండ్రు బేర గాండ్రన్ననో నన్ను వెక్కిరింపుచు నసహ్యకరమైన సైగలంజేయసాగిరి. అట్టి సమయములో నాస్థితి యెట్లుండెనో శీఘ్రమే యిల్లు చేరుకొనుటకు నా మనసెట్లు త్వరపెట్టెనో దాని నూహించి మీరే తెలిసికొనుడు.

బొంబాయినగర వాస్తవ్యులతీరిట్లుండగా, బంగాళావారి రీతి యిక జెప్పుటకే శక్యముగాకున్నది. ఇది యెల్ల కడు శోచనీయము. గాలిపట్టుల కెప్పుడయిన నేను వ్యాయామము కొరకు పోయినప్పుడు ఇంగ్ల్లీషువారయిన నన్నెప్పుడు కన్నెత్తి యంత నిబ్బరముగా జూడరయిరి. కాని బంగాళావారు తమ దంభమునంతను వెల్లడిచేసి హాస్యాస్పదము గావించుకొన నన్ను గని, "నీ వెవతెవు? నీ పేరేమి? నీస్థల మేమి? నీ వెందుల కేగెదవు?" అని యపరిచితు లడుగ గూడని ప్రశ్నల నడిగి యాగడ మొనర్చిరి. శ్రీరామపురములో విద్యావంతులని యెన్నిక గన్న కొందరు స్వదేశ క్రైస్తవులు నేను వివాహితనో, వితంతువునో దుర్వర్తన గలదాననో, కులభ్రష్టనో యని శంకింపుచుండిరి. ప్రియులయిన యో సభాజనులారా! యిట్టి యవినయప్రచారములు స్వదేశ క్రైస్తవులు చేయగూడునా? ఎంతమాత్రము చేయగూడదు. వీనిని మీకిట్లు విన్నవించుట మీరిట్టి లోపములను సవరణ చేయ దివియెదరనియు, మీలోని కష్టముల నెన్న