పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నీమె ప్రాణతుల్యుడగు సోదరుడు లక్ష్మణరావుగా రొకనాడొక ప్రసంగవశమున నాగోజీభట్ట కృతమగు "శబ్దేందు శేఖర:పుత్రో మంజూషా మను కన్యకా" అను శ్లోకమునుజదివి, నాగోజీభట్టుగారు తనకు బుత్ర పుత్రికావియోగము గలుగగా దన రచించిన "శబ్దేందు శేఖర" మను గ్రంథము తన పుత్రుడు గాను, "మంజూష" యను గ్రంథము తన పుత్రిక గాను నుండునని మనస్సమాధానము చేసికొనినట్లు చెప్పగా, నాటనుండియు నచ్చమాంబ గారు నాగోజీభట్టు గారి వలెనే తానును మనస్సామాధానము పొందవలెనని కోరి 'అబలా సచ్చరిత్ర రత్న మాల" రచనకు గడగిరట. తన "అబలా సచ్చరిత్ర రత్న మాల" ప్రథమభాగము యొక్క పీఠికను మొదట "బ్రపంచకమునందలి జనులకు బరమేశ్వరుడు సదా మేలే కలుగజేయు నియు, అట్లయినను నొకప్పుడతడు సేయు మేలు మనకు దు:ఖరూపముగా గాన్పించుటవల మనమా దయానిధిని నిష్కరుణుడని నిందించెదమనియు, నట్లు నింధించుట మిక్కిలి యజ్ఞానమనియు, దత్వము విచారించి యెడల నీ కీడు మన మేలేయని తోచుననియు సుజ్ఞులు చెప్పెదరు. ప్రస్తుత మీ గ్రంథరచనకుగల్గిన కారణమువలన నీసంగతి నిజమని తేలుచున్నది." అని యీ విజ్ఞానవతి వ్రాసియున్నది. ఈ యబలా సచ్చరిత్ర రత్నమాలయొక్క మొదటిభాగము 1901 సం||లో బూర్తిగా బ్రకటింపబడియెను. ఈ రత్నమాల ఐతిహాసిక కాలములోని యుత్తమ స్త్రీల చరిత్రములతో మొదటిభాగమును, వైదిక, పౌరాణిక, బౌద్ధ స్త్రీల చారిత్రములతో రెండవభాగమును, ఇంగ్లాండు మొదలగు పరదేశములలోని స్త్రీల చరిత్రలతో మూడవభాగమును, ఇట్లు మూడు భాగములుగా నచ్చమాంబగారు వ్రాయదలచిరి. మొదటి భాగము ముగియగనే రెండవభాగము వ్రాయ మొదలు పెట్టిరి. కాని, యే గ్రంథము వ్రాసినను బూర్తిగా సంగతులు గనుగొని వ్రాయవలయుననియు, వ్రాసిన సంగతులు విశ్వాసార్హములుగా నుండ వలయుననియు నీమె యుద్దేశము. కావున, నీమెయే వేదవాక్యము నుదహరించినను, ఏ పురాణశ్లోకము నుదహరించినను, బ్రత్యక్షముగా నాయా వేదముల యందు, నాయా పురాణములయందు జూడనిది వ్రాయు దికాదు. ఒక్కొక్క వేదవాక్యము సంపాదించుట కెన్నియో నెలలు పట్టుచుండెను: ఈమె 1903 సం||న బుణ్యక్షేత్రాదుల సేవించుటకును, దన సఖుల దర్శించుటకును గృష్ణా, గోదావరీ మండలములు మున్నగు తావులకు వెడలినప్పుడు, కాశీ క్షేత్రములో