పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1879 వ సంవత్సర ప్ర్రారంభమున గోపాలరావుగారిని బొంబాయికి మార్చిరి. అచట నుండుకాలములో ఆనందీబాయి కొంతవర కింగ్లీషును, సంస్కృతమును నేర్చుకొనెను. కాని యచటను లోకులామె విద్యాభ్యాసమున కనేక విఘ్నములు తెచ్చుచుండిరి. ఇట్లుండగా 1880 వ సంవత్సరము నచటనుండి భూజయనుగ్రామమునకు మార్చినందున, నాదంపతు లచటి కరిగిరి. బొంబాయినుండి భూజకు బోవునపుడు ఆనందీబాయి ముత్తవ యామెతోడ రానందున నింటిపని యంతయు నామెయే చేయవలసి యుండెను. ఇంటిపనినంతను చేసి యానందీబాయి భర్తకడ నింగ్లీషు మాటాడుట చక్కగా నేర్చుకొనెను.

గోపాలరావుగారికి భార్యను విశేష విద్యావతిని జేయవలెనని యుండుట నొక వార్తాపత్రికలోన జదివి ఆమేరికాలోని న్యూయార్కు పట్టణవాసినియగు మిసెస్ బీ.ఎఫ్.కార్పెంటర్ అను నామె ఆనందీబాయికి సహాయము చేయదలచి యామె కొకఉత్తరమువ్రాసెను. ఈమెయే ఆనందీబాయి కనేక విధముల సహాయముచేసి యామెను కూతిరివలె జూచుచుండెను. కాన ఆనందీబాయియు నీమెయం దధికప్రేమ గలది యయి ఈమెను పిన్ని యని పిలుచుచుండెను. ఈమెకు ఆనందీబాయి వ్రాసిన యుత్తరముల వలన మనదేశమునందలి స్త్రీలకు గల పరతంత్రతయు, దానిని వదలించుటకై ఆనందీబాయికి గల యభిప్రాయములు దెలియుచున్నవి. స్త్రీలకు విశేష విద్యగరపినంగాని స్వహితము తెలియదని యామె మతము. ఇదియంతయు నామె