పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అక్బరుబాదుషా తనయమిత సైన్యముతో చితూరుపై దండు వెడలినప్పు డచట నుదయసింగు డనురాజు రాజ్యము జేయుచుండెను. ఉదయసింగు రాణా యంతటి పిరికి రాజపుత్రుడు మరియొక డుండడు. అక్బరుబాదుషా దండెత్తి వచ్చిన వార్తవిని రాణాగారికిభయమువలన దేహముకంపమెత్తెను. కాన ఆయన విజయులగు తురుష్కు సేనలతోడ బోర సాహసింప లేడయ్యె. అందుపై నాతని శూరులగు సరదార్లందరుకుంభ రాణా మొదలగు నాతని పూర్వుల ప్రతాపమును దెలిపి యుద్ధమునకు బురికొల్పసాగిరి. కాని యతడు యుద్ధమునకు వెడల డయ్యెను. రాణా సంగ్రామమునకు వెరచుట గని, యాతని సరదార్లు మిగుల నాగ్రహించి "మీరు శత్రువుల నెదిరించి యుద్ధము చేయకుండిన యెడల మిమ్మును రాజ్యభ్రష్టులను జేయుదుము" అనిరి.

ఇట్లందరు నేకతీరుగా జెప్పినందువలన విధి లేక భయముచే దేహము వడక, నాయధైర్యశిరోమణి వీరులగు తన సైనికులతో యుద్ధభూమిని సమీపించెను. కాని సాగరమువలె నలుగడల నిండియున్న యవనసైన్యములంగని భీతిచే గొంతవడి నేమియు దోచక నిలుచుండెను. తదనంతర మెటులనో యారాజు తన సైన్యములకు యుద్ధమున కనుజ్ఞయిచ్చెను. రజపూత శూరసైనికు లందరు మిగుల శౌర్యముతోడ బెనగజొచ్చిరి. వారు జయకాంక్షవలన నెంతపోరినను, ముఖ్యనాయకుని యధైర్యమువలనను, పరబలాధిక్యమువలనను వారికి జయము కలుగు మార్గము కానరాకుండెను. చితూరు కొర