పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పన్నా

క. ఇప్పుడు నయ్యుత్తమసతి| నప్పురమున నొప్పువార లతిముద మెదలం
   జొప్పడ గీర్తనసేయుదు| రిప్పరసున నుండవలదె యింతులు పుడమిన్.
[చింతామణి.]

మేవాడదేశపు రాజగు సంగ్రామశింహుడు మృతుడయినవెనుక నాతని పుత్రులు ముగ్గురిలో నిరువురు స్వల్పకాలమే రాజ్యము పాలించి పరలోకమున కేగిరి. మూడవవాడగు ఉదయసింహు డైదేండ్లప్రాయము కలవాడయి దాదిపోషణలోనే యుండెను. ఈతని దాదిపేరు పన్నా. ఈ పన్నాకు రాజధాత్రిత్వము వంశపరంపరగా వచ్చుచుండెను. ఈమె సుగుణములు మిగుల విలువగలవని తెలుపునటుల గాబోలును నవరత్నములలోని దగు * (పన్నా పచ్చ) యని తలిదండ్రులామెకు బేరిడిరి. పన్నా వారిడిన నామమునకు దగు గుణవతి యయ్యెను.

సంగ్రామసింహుని పుత్రు లిరువురును స్వర్గస్థులైనపిదప, నుదయసింహుపేర పృథివీరాజునకు దాసీపుత్రుడగు బనబీరుడు రాజ్యము నడుపునట్లేర్పాటు చేయబడెను. బనబీరుని జన్మమువలెనే గుణమును నీచమైనదియేగాన, వాడు తాననర్హుడయినను,


  • ఈమె పేరు ఒకానొక తెలుగు గ్రంథకారుడు మోతి (ముత్యము) యని వ్రాసినాడుగాని యందు కాధారమేమియు రాజపుతానా చరిత్రమునందు గానరాలేదు.