పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లేదు. కవిత్వధోరణి యెట్టులుండవలయునో యన్న విషయమై యీమె సుందరమైన మూడు పద్యములు వ్రాసియుంచినది. ఆ మూడు పద్యములు కవిత్వము జెప్పువారందరును తమతమ హృత్పటములమీద వ్రాసియుంచుకొనదగినవి. అవిఏవియన-

క. మును సంస్కృతంబు తేటగ | దెనిగించెడిచోట నేమి తెలియకయుండన్
   దనవిద్య మెఱయగ్రమ్మఱ| ఘనముగ సంస్కృతము చెప్పగా రుచియగునే?

గీ. తేనె సోక నోరు తియ్యన యగురీతి దోడనర్థ మెల్ల దోచకున్న
   గూడశబ్దవితతి కొట్లాటపని యెల్ల మూగచెవిటివారి ముచ్చటరయ

క. కందునమాటల సామెత లందముగా గూర్చి చెప్పనవితెనుగునకుం
   బొందై రుచియై వీనుల విందై మరి కానిపించు విబుధుల కెల్లన్.

మొల్లకు గవిత్వస్ఫూర్తి విశేషముగా నుండినందున నామె యాశుకవిత్వము సులభముగా జేయుచుండెను. మొల్ల తలయంటికొని స్నానముచేసిన పిదప రామాయణరచన కారంభమును చేసి తల వెంట్రుకలారులోపల నొక కాండమును ముగించెనని లోకవార్త గలదు. "అక్కడక్కడ గొన్ని వ్యాకరణదోషము లున్నను మొత్తముమీద నీమె కవిత్వము మిక్కిలి మృదువై; మధురమై రసవంతముగా నున్నది. ఈ రామాయణము గొంతకాలము క్రిందటివరకును వీధిబడులలో బాలురకు పాఠమునుగా జెప్పుచుండిరి. ఇది పురుషులు చెప్పిన గ్రంథములలో ననేకములకంటె మనోజ్ఞమై ప్రౌడమై యున్నది." అని కవిచరిత్రకారులీమె కవిత్వమును గురించి వ్రాసియున్నారు. మొల్లభక్తిపూర్వకముగా రచియించిన రామాయణము మొల్లరామాయణమను పేరిట నాంధ్ర