పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొల్ల

   కిం కులేన విశాలేన విద్యాహీనేన దేహినాం
   దుష్కులం చాపి విదుషో దేవైగపి సుపూజ్యతే*

మొల్ల యాత్మకూరి కేశయసెట్టి కూతురు. ఈమె కులాలవంశ సంభూతయని పరంపరగా వాడుక వచ్చుచున్నది. ఆంధ్రమునందు నీమె రామాయణము రచించినందున నీమెకీర్తి జగములో నజరామరమై యున్నది. ఈ యువతి 16 వ శతాబ్దారంభమున నున్న ట్లూహింపబడు చున్నది.

    ... ... ... ...గోప
    వరపు శ్రీకంఠమల్లేశు వరము చేత| నెఱి గవిత్వంబు చెప్పగ నేర్చినాను.

అని చెప్పుకొనుటచే, నీమె నివాసస్థలము నెల్లూరిమండలములోని గోపవరమన తెలియుచున్నది. ఈమె రామాయణము చదివినవారంద రీమెకు దెనుగున దత్యంత ప్రావీణ్యముండెనని యొప్పుకొనక మానరు. ఈమె కవిత్వము మృదు మధురమై, 'తేనె సోక నోరు తియ్యన యగురీతి, దోడ నర్థమెల్ల' దోచునదియై, 'గూడశబ్దవితతి కొట్లాట' లేనిదియై, ద్రాక్షాపాకమై యొప్పుచున్నది. గూడపదగుంభనముచే నర్థకాఠిన్యము సాధించి చదువరుల బాధపెట్టుట యామె కెంతమాత్రమును ఇష్టము


  • శ్రేష్ఠమైన కులములందు బుట్టివిద్య లేకుండిన నేమి లాభము? నీచకులమునందు బుట్టినను విద్యావంతులైనవారు అందరికి బూజ్యులు. అనగా కులము ప్రధానము గాదు; గుణమే ప్రధాన మన్నమాట.