పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేసెను "మీరు భీమసింహునివిడిచిడిల్లీబయలుదేరిన యెడల నేను తగుదాసీలతోడంగూడి యచటికి వచ్చెదను. కాని నా దాసీల పరువునకును, రాణివాసమునకును మీ సైనికులు భంగము సేయకుండునటుల కట్టుదిట్టములు చేయవలయును." పద్మిని తెలిపిన వార్త విని అల్లా ఉద్దీను పరమానందభరితు డయ్యెను. అంత నాత డామె యన్నప్రకార మొప్పుకొని యామెకు ద్వరలో రమ్మని కబురు పంపెను. బాదుషాయొద్దనుండి తన పలుకుల కంగీకారము వచ్చుట విని, పద్మిని తాను ప్రయాణ మాయెను. ఆమెతోడ వచ్చుటకు నేడువందల మేనాలను సిద్ధపరచెను. ఒక్కొకమేనాలో ముగ్గురేసి శూరులు ఆయుధహస్తులయి కూర్చుండిరి. ప్రతిమేనాకును నారుగురువంతున గుప్తాయుధులగువీరు లాయందలములను మోయుచుండిరి. పద్మిని తన సైన్యమునకును, తనకును దోడుగా గోరాసింహుని, నాతని పుత్రుడగు బాదలుని సహితము తనతో దీసికొని పోయెను. ఇట్లు వీరందరు తురకలశిబిరమును సమీపించి బాదుషాయాజ్ఞవలన నామేనాల నన్నిటిని శిబిరములోనికి నిరాటంకముగా గొనిపోయిరి. తదనంతరము పద్మిని భీమసింహునినొకసారి చూచెదనని బాదుషాకు తెల్పి, భీమసింహుని కైదుచేసిన స్థలమునకు దన మేనాను బట్టించుకొని చనెను. అంత స్త్రీలవలెనున్న యా గుప్తసైన్యమంతయు తమ నిజస్వరూపమును గనబరచి మ్లేచ్ఛసైన్యముల దైన్యము నొందింపసాగెను. భీమసింహు డదియంతయు నేమని యడుగుచుండగా పద్మిని యాతనిని త్వరపెట్టి సిద్ధపరచి తెచ్చిన