పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భక్తితో గొలుచు విగ్రహముల నాశమునకు దోడుపడకుడు. మన స్వాతంత్రసుఖమును చెరుప బ్రయత్నించినయెడల పిదప విశేషదు:ఖము కలుగును." అని విన్నవించుకొనెను. ఇంతలో జయచంద్రుడు రోషారుణలోచనుడయి "నోరుమూసికొని వెళ్లు. నావద్ద నీవంటి దుష్టస్త్రీలు మాటలాడదగరు." అని ధిక్కరించెను. "అటులైన నాప్రార్ధన యంతయు వృధవోయనా?" యని యా కాంతాలలామ రౌద్రరూపము వహించి తండ్రివంక జూచి యిట్లనియె. "పూర్వులార్జించిన సత్కీర్తిని నాశముచేసి మీదుష్కీర్తిని శాశ్వత పరుచుటకు బూర్వమే నీ కుమార్తెనయిన నన్ని యుపకీర్తివినకుండ నేల చంపవైతివి? నీవు నాతండ్రివిగాన నేనింతగా జెప్పవచ్చితిని. కాని నీ యభిప్రాయ మెరిగిన పిదప స్వదేశద్రోహి కూతురనిపించుకొని బ్రతుకుటకంటె జావుమేలని తోచుచున్నది."

ఆడుసింగమువలె నెదిరించి మాటాడు కూతునకేమియు జెప్పజాలక జయచంద్రుడు మెల్లగా నావల కరిగి యశ్వము నెక్కి యా మ్లేచ్ఛసైన్యములోని కేగెను. ఇచట సంయుక్త తండ్రి లోపలకు వచ్చునని కొంతసేపెదురు చూచి యాతడు వచ్చు జాడగానక నిరాశతో మరలి తన పతి చెంతకేగెను. ఈ తడవ తమవైపున నల్పసైన్యమును, పగఱ వైపున నమిత సైన్యమును గలదు గాన, తన క పజయమే యగునని పృథ్వీరా జెరిగి యా సంగతి సంయుక్తకు దెలిపెను. ఆ దంపతు లిరువురును ఇసుమంతయు ధైర్యము విడువక నొకరి కొకరు తగు నీతుల నుపదేశింపుచు నుత్సాహయుతులై యుండిరి. వారిరువురి ఆలో