పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాణి సంయుక్త

12 వ శతాబ్దమునందు రాఠోడ్ వంశీయుడగు జయచంద్రుడుకనౌజ (కాన్యకుబ్జ) రాజ్యమును, చవ్హాణవంశొద్ధారకుడగు పృధివీరాజు డిల్లీరాజ్యమును పాలింపుచుండిరి. ఈయసామాన్య పరాక్రమవంతు లిరువురిలో సంయుక్త జయచంద్రునకు గూతురును, పృథివీరాజునకు భార్యయు నయ్యెను. కాన నా రెండువంశములును నామెవలన బవిత్రములయ్యె ననుటకు సందేహము లేదు.

జయచంద్రునకు సంయుక్త యొక్కతయే కూతురగుట వలన, జయచంద్రుడు సంయుక్త నెక్కువ గారాబముతో బెంచెను. సంయుక్త స్వభావమువలననే సద్గుణవతిగాన, బెరిగిన కొలదిని ననేకవిద్యల నేర్చి మిగుల నుతికెక్కెను. ఆమె సద్గుణములును లావణ్యమును గనిన ప్రజలందరు దమ జన్మము సార్ధకమయ్యెనని తలచి సంతసింపుచుండిరి. ఇట్లీమె కొన్నిదినములు బాల్యావస్థయందు గడపియౌవ్వనావస్థం దాల్చెను.

ఇట్లు యుక్తవయస్కురాలగు బిడ్డకు దగినవరు డెవడాయని జయచంద్రుడు చింతింపసాగెను. సంయుక్త రూప లావణ్యములకీర్తి సకలదిక్కులను వ్యాపించినందున ననేక రాజపుత్రులామెను దమ కిమ్మని కోరుచు వర్తమానము లంపిరి. డిల్లీ పతియగు పృథివీరాజామె రూపగుణములను విని యామెను నెటులయిన జేపట్ట నిశ్చయించెను. సంయుక్తయు