పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావలయు సాధనములు నాయొద్ద లేనందునను, ఆసాధనములు సమకూరువరకు నైతిహాసిక స్త్రీచరిత్రములను ఆపుట యోగ్యమని తోపనందునను, వైదిక, పొరాణిక స్త్రీలను రెండవభాగము నందు జేర్చెదను. ఇదియొక గొప్పదోషముగాదు గనుక చదువరులు మన్నింతురుగాక!

మొదటిభాగమునందలి చరిత్రము లన్నియు నాయొద్ద నొకసారి గూడనందున జరిత్రములు కాలక్రమముగా వ్రాయుటకు వీలుగలదు. ఏయేచరిత్రము నా కెప్పుడెప్పుడు దొరకునో యాయాచరిత్ర మప్పుడప్పుడు వ్రాయబడును. చరిత్రాధ్యయనము మనముఖ్యోద్దేశముగాని, పరీక్షలకు జదువువారివలె కాలగ్రమానుగతమైన చరిత్రములను జదువుట మన యుద్దేశము కానందున, నీ చిన్నదోషమునుగూడ చదువరులు మన్నింతురుగాక!

మొదటిభాగమునందు రాగల రాణీ భవానిగారి యొక్కయు, రాణీసువర్ణమయిగారి యొక్కయు చరిత్రములలోని కొన్నిభాగములు జనానాపత్రిక యందు బ్రచురింపబడినవి. ఆ భాగములు గూడ నిందు జేర్పబడినవని యెరుగునది.

భండారు - అచ్చమాంబ
_______