పుట:Abalaa sachcharitra ratnamaala.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యందధిక పూజ్యభావము గలిగి యా యాంగ్లేయు డామెకు హిందూరీతిని ననుసరించి సాష్టాంగముగా నమస్కరించెను.

స్త్రీలయినను, పురుషులయినను, శ్రీమంతులయినను, బీదలయినను, కులీనులయినను, కులహీనులయినను, విద్వాంసులయినను, మూర్ఖులయినను, భేదభావములేక భగవతీదేవి యందరను సమానముగా జూచుచుండెను. ఈ సమభావము చేతనే యామె సకలజనులచే సకలదిక్కుల బూజింపబడు చుండెను.

భగవతీదేవిగారి దయకు మితిలేకయుండెను. పరుల దు:ఖముం గనిన నామెహృదయము కరగిపోవుచుండెను. ఆమె యతిథులకు, నభ్యాగతులకు, విద్యార్థులకు, రోగులకు సహాయము చేయుచు వీరసింహ మనుపల్లెలోనే వాసము చేయుచుండెను. ఒక సమయమునందు విద్యాసాగరు లామెను కలకత్తాకు దీసికొనివచ్చిరి. కలకత్తాలో వీరసింహములో జేసినట్టు పరోపకారము చేయుటకు వీలులేదని చూచి, యామె కుమారునితో బలికిన పలుకులు వినిన పాషాణహృదయులు గూడ దయామయులగుట వింతకాదు. ఆమె కుమారునితో నిట్లనెను. "నేను వీరసింహమునకు బోకుండిన మనయింట నారగించి విద్య నభ్యసించు విద్యార్థుల కెవరు భోజనము పెట్టగలరు? ఎండ వానలలో నడచి యలసివచ్చిన యతిథులకు నాశ్రయ మొసగువారెవరు? నిరాశ్రయమగు కుటుంబమునకు నాశ్రయ మొసంగువారెవరు? ఇట్లచ్చట ననాథులు కష్టపడుచుండగా నేనిచ్చట నెట్లు సుఖముగా నుండగలను? నన్నుత్వరగా