పుట:Abaddhala veta revised.pdf/90

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వెనుక మతం వున్నదని గ్రహిస్తే మంచిది. అలాగే కుటుంబ నియంత్రణ కావాలనే వారు, దీనిని మతం వ్యతిరేకిస్తున్నదని గ్రహిస్తే మేలుకుంటారు. ప్రభుత్వం తలపెట్టే ప్రతి అభ్యుదయ చర్యకూ మతం అడ్డొస్తుంది. కనుక మతాన్ని పోషిస్తూ సంక్షేమ రాజ్యం తేవడం కల్ల.

హేతువాదులకు సూచన:

మీ జిల్లలో, కనీసం ఒక ప్రాంతంలో వున్నా ఆశ్రమాన్ని, బాబాను, మాతను ఉదాహరణగా స్వీకరించి, వారి పుట్టుపూర్వోత్తరాలు సేకరించండి. ఆస్తుల వివరాలు తెలుసుకోండి. బాబా కుటుంబ వ్యవహారం, అతడి మానసిక ప్రవృత్తి వివరాలు నోట్ చేయండి. ఈ సమాచారం వలన విశ్లేషణ మొదలుపెట్టవచ్చు. ఇటువంటి పరిశోధన వైజ్ఞానిక పద్ధతిలో జరగాలి. ప్రభుత్వం వద్ద యిటువంటి సమాచారం వుండదు. పరిశోధనకు బాగా ఉపకరించే యీ విషయాలు, సమాజానికి ఎంతో తోడ్పడతాయి. ఏ రాజకీయ పార్టీ కూడా యీ పనికి పూనుకోదు. కనుక హేతువాదులకు పొటీలేని రంగం యిది.

- హేతువాది, నవంబరు 1992


పిల్లల్ని మతాలకు దూరంగా వుంచండి

తండ్రి తెలుగుదేశం పార్టీలో వుంటే కుమారుడు (మైనర్)కూడా తెలుగుదేశం పార్టీకి చెండుతాడా? తల్లి కాంగ్రెస్ అయితే బిడ్డ (మైనర్) కూడా కాంగ్రెస్ పార్టీలో వుండాలా? రాజకీయాలు వంశపారంపర్యం కాదు. పెద్దవాళ్ళకు, అవవగాహనతో, 18ఏళ్ళ తరువాత విచక్షణతో వోటువేసే హక్కు యిచ్చారు. ఎందుకని? చిన్నపిల్లలకు ఓటుహక్కు ఎందుకు లేదు? వారి పరిధి కాదు గనుక! యుక్తవయస్సు వచ్చిన తరువాత, రాజకీయాల్లో వారిష్టమోచ్చిన పార్టీలో చేరవచ్చు, చేరకపొవచ్చు. కనుక పుట్టగానే రిజిస్టర్ లో ఏ పార్టీ అనే కాలంలో ఫలానా పార్టీ అని రాయరు.

చిన్నపిల్లల్ని అశ్లీల సాహిత్యానికి, బూతు సినిమాలకు, అసభ్యశృంగారానికి దూరంగా వుంచాలంటారు. ఎందుకని?

అలాగే, మతం. నమ్మకాలు కూడా చిన్నపిల్లల పరిధిలోనివి కావు. అవి అవగాహన వున్నా పెద్దవారికి పరిమితం.

కాని తల్లితండ్రులు తమ మతాన్ని పుట్టగానే పిల్లలపై రుద్దుతున్నారు. నమ్మకాలు నూరిపోస్తున్నారు. ఇది పిల్లల పట్ల గొప్ప నేరం, ఘోరకృత్యం. మతంలో వుండే అసహనం, గుడ్డినమ్మకాలు, పరమతద్వేషం, అన్నీ పిల్లలకు వస్తున్నాయి. అలాగే దురాచారాలు, కూడా అలవాట్లుగా, జీవితంలోభాగంగా మారుతున్నాయి. మతం పెద్దల పరిధి. కనుక రాజకీయాలు, సెక్స్ వలె, మతాన్ని కూడా పిల్లలకు దూరంగా వుంచాలి.