పుట:Abaddhala veta revised.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెడితే మహమ్మదీయులు విజృంభిస్తారు. ఆవు జోలికి పోతే హిందువులు ఆగరు. ఎటొచ్చి విలువ లేనిది మనిషికే. అదీ మత సారాంశం.

ఏతా వాతా చెప్పొచ్చేదేమంటే, యీ మతాలను వాటి పేరిట దేవుళ్ళుగా వెలసే వారిని కని పెట్టి వుండడం అవసరం. సమాజంలో వారికి ప్రత్యేకత వుండరాదు. ఆశ్రమలు, బాబాలు, మాతలు, మసీదులు, దేవాలయాలకు సంబంధించిన ఆస్తి వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడించ వలసిన అవసరం వున్నది. లేకుంటే సమాంతరంగా నల్ల డబ్బుతో వీరు 'రాజ్యం.' చేస్తున్నారు. వీరి ఆదాయం ఎక్కడిదో చెప్ప వలసి వున్నది. దానిపై అందరి మీద వేసినట్లు పన్ను వేయాలి.

తిరుపతి హుండీలో రహస్యంగా ముడుపూ వేసే పద్దతికి స్వస్తి పలకాలి. దొంగ డబ్బు సంపాదించిన వాడు, భయానికి లక్షల ధనం అర్పిస్తే మంచి పని చేశాడనడం వెర్రి అవుతుంది. నిజమైన భక్తుడికి భయం వుండ వలసిన పని లేదు గదా. లెక్క బెట్టి, ముడుపులు చెల్లించి, రసీదు పొందాలి. అంత డబ్బు ఎలా సంపాదించాడో చెప్పగలగాలి. ఆదాయపు పన్ను చెల్లిస్తున్నాడా లేదా చూడాలి. భగవంతుడి సన్నిధిలో భయమెందుకు? ప్రభుత్వం కూడ మతాల ఆదాయాలకు ఏ విధమైన మినహాయింపులు యివ్వరాదు. అయితే కొందరు వాదిస్తున్నట్లు అటువంటి డబ్బు బడులకు, మందిరాలకు సద్వినియోగ మౌతుందిగా అని అనవచ్చు. ఆదాయపు పన్ను వేస్తే ప్రభుత్వానికే గదా డబ్బు చెందేది. ప్రభుత్వం ఖర్చు పెట్టేది కూడ ప్రజల సంక్షేమానికే గదా? పైగా దొంగ డబ్బు అరికట్టడం వలన, రూపాయి విలువ పెరిగి, ధరలు అదుపులోకి వచ్చి, ద్రవ్యోల్బణం తగ్గుతుంది కూడ. కాషాయ వస్త్రం వేసుకున్న ప్రతి గడ్డపు వాడికి, జుట్టు పెచుకున్న వారికీ, మినహాయింపులు ఇస్తుంటే, దోపిడీని ఎలా అరికడతారు? సమాజం నుండి పారిపోయి, బాధ్యత రహితంగా తిరిగే వాళ్ళంతా, దైవం పేరిట, మతం మాటతో మనుషుల్ని కాల్చుక తింటున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర ఆత్మ శాంతి లభిస్తుందని భ్రమ పడు తున్నారు. కాని పాండిచ్చేరి అశ్రమం కట్టిన అరోవిల్ చూడండి. కొట్లాటలతో సతమతమౌతున్నారు. ఆస్తులున్న చోట యివి తప్పవు. మన దేవాలయాల ట్రస్తీల సంగతి చాణుక్యుడే చెప్పాడుగా. ఒక కంట కని పెట్టి వుండమని.

మతం వున్నంతా కాలం మనిషికి శాంతి వుండదు. చరిత్ర రుజువు చేసిన సత్యమిది. సమాజంలో యితర శాఖల్ని చూచినట్లే మతాన్ని చూడడం ప్రబుత్వ సెక్యులర్ విధి. ప్రజలు వీటణ్ణీటినీ ఒకపట్టాన అంగీకరించరు. ఎందుకంటే మతం నూరిపోసిన, పోస్తున్న అజ్ఞానం వారికి వంట బట్టి వున్నది గనుక. అది క్రమేణ పోగొట్టాలి. హేతు వాదులు ఈ ప్రచారం చేయాలి. చదువులో హేతు విధానం రావాలి. మతం పోతే అధ్యాత్మిక అమానుష నీతి పోతుంది. మానవ నీతి వస్తుంది. కనుక మతం లేకుంటే విలువలు పోయాయనడం ఘోర సూక్తి. అంట రాని తనాన్ని, మనుషుల్లో తార తమ్యాల్ని, మనస్సును ధ్యానం పేరిట తాకట్టు పెట్టించే విధానాన్ని అలోచనను చంపేసే రీతుల్ని మతం పెంచి పోషించింది. అంట రాని తనం పోవాలి అని కేకలేసే వారు దీని