పుట:Abaddhala veta revised.pdf/76

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అమెరికా మాంత్రికుడు జేమ్స్ రాండి యీ విషయాలను లోగడ వివరించాడు. హేతువాది ప్రేమానంద్ సువార్త కూటాలవద్దకురాగా, భక్తులు కొందరు ఆటంకపరిచారు. బయట సభపెట్టి క్రీస్తు మహిమల రహస్యాన్ని ఆయన వివరించాడు.

ఒక బావిలో నీటిని ద్రాక్ష సారాయిగా మార్చవచ్చుగదా. అలాగాక, కేవలం రాతి కూజాలు అమర్చి వాటిలో పోయించి ద్రాక్షసారాయిగా ఎందుకు మార్చినట్లు? అదే రహస్యం. క్రీస్తుకు బావిలోనీటిని మార్చగల శక్తి లేదు. ఆయన తాను నేర్చిన మాంత్రికవిద్యతో ట్రిక్కు ప్రదర్శించి, ఆకర్షించాడు. ఎలాగ?

పెద్ద రాతి కూజాలలో చిన్న రాతి కూజాలు అమర్చాడు. చిన్న కూజా అంచు పెద్ద కూజా పైకి వుండేటట్లు ఏర్పరుస్తారు. చిన్న కూజా జనానికి కనిపించదు. పెద్దకూజాలో ద్రాక్షసారాయి పోస్తారు. తరువాత చిన్నకూజా లోనపెట్టి, తలక్రిందులు చేస్తే చిన్న కూజా పెద్ద కూజాలో అతుక్కుపోతుంది. తరువాత చిన్నకూజాపై మూతపెట్టి పెద్దకూజా మూతతీసి,అందులో ముందుగానే పోసిన ద్రాక్షరసాన్ని పంచుతారు. ఈ ట్రిక్కు తెలియక, భక్తులు అద్భుతంగా దాన్ని భావిస్తారు.

బాబా పూనకం

ప్రతిరోజువలె నేడు కూడా బాబా 12 గంటలకు దర్శనం యిస్తారని భక్తులు చెప్పారు. దర్శనార్థం వచ్చినవారు కానుకలు సమర్పించి, ప్రార్థనలు చేస్తున్నారు.

రోజూ రావలసిన సమయానికి బాబా రాలేదు. ఒక శిష్యుడు వచ్చి నేడు బాబాకు పూనకం వచ్చింది. అమ్మవారి దర్శనం ఆయనతోపాటు యితరులకు సైతం చూచే భాగ్యం కల్పిస్తారని ప్రకటించారు.

బాబా రానున్న సందర్భంగా ఒక తెల్లని వస్త్రం పరచారు. బాబా కాళ్ళను కడిగిన భక్తుడు, ఆ నీళ్ళను కళ్ళకు అద్దుకున్నారు. అప్పుడు ప్రవేశించిన బాబా ఆ తెల్లని వస్త్రం పై పాదాలు పెట్టగానే, అమ్మవారి పాదాలవలె ముద్రలు పడ్డాయి. బాబా, పూనకం వచ్చినట్లు ఏవేవో మంత్రాలు చదివారు. గ్రామస్తులు ఏం చేయాల్సిందీ చెప్పారు. తెల్లని వస్త్రం పై ఎర్రని పాదముద్రలు అక్కడి భక్తులంతా కళ్ళారా చూచారు.

భక్తులలోని ఒక సందేహవాది యీ విషయాన్ని హేతువాది ప్రేమానంద్ కు చెప్పారు. ఆయన విషయ వివరణ చేశారు.

బాబా వచ్చేముందు పరచిన తెల్లని వస్త్రం అంతకుముందే పసుపు ద్రావంలో తడిపారు.ఎండబెట్టారు. వస్త్రం పై అంటిన పసుపు పౌడర్ ను దులిపారు. వస్త్రం మళ్ళీ తెల్లగా కనిపించింది. బాబా ఆ వస్త్రం పై నడవబోయే ముందు భక్తుడు కాళ్ళు కడిగాడు గదా. ఆ నీళ్ళు నిమ్మరసం కలిపిన