పుట:Abaddhala veta revised.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అప్పుడు కూడా ప్రార్థనలు చేసి ఏసు మహిమగా చెబితే పరీక్ష చేయకుండా నమ్మే భక్తులు నమ్ముతారు.

జ్వాలాముఖి మహత్తు

ఉత్తరాదిలో గోరక్ నాథ్ దిబ్బ జ్వాలాముఖి గుడిలో వుంది. భక్తులు యీ గుడిని సందర్శించినప్పుడు బుడగలతో వుడికిపోతున్న నూనె కనిపిస్తుంది. భక్తులు ఆ దృశ్యం తిలకించి, కానుకలు సమర్పిస్తారు అద్భుత దృశ్యంగా చూచి మహత్తుగా భావిస్తారు. భక్తుల తలలపై మండే నూనెను పురోహితుడు చల్లినప్పుడు, అది మంచువలె చల్లగా మారుతుంది. కొందరు శాస్త్రజ్ఞులు సైతం ఈ దృశ్యం చూచి, తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు.

జ్వాలాముఖి గుడి నూనె బావిలో బుడగలు వస్తున్నమాట వాస్తవం. పురోహితుడు ఒక కాగితాన్ని వెలిగించి, నూనెపై వుంచితే గాస్ తగులబడుతుంది. అలాంటి నూనె పురోహితుడు భక్తులపై చల్లితే మంచు నీరుగా ఎలా మారుతుంది? హేతువాది ప్రేమానంద్ ఈ గుడి సందర్శించి, జరుగుతున్నదంతా గమనించాడు. సహజవాయువు బయటకు వచ్చేచోట జ్వాలాముఖి గుడిని నిర్మించారు. ఒక గొట్టం ద్వారా వచ్చే గాస్ నిరంతరం వెలుగునిస్తుంటుంది. గాస్ బావి ప్రక్కగా ప్రవహించే నీటిబుడగల్ని చూచి, గాస్ ప్రవాహం వలన అవి ఏర్పడుతున్నాయని భక్తులు భావిస్తున్నారు, నీటిబుడగలు సహజవాయువుతో కలిసినప్పుడు తుకతుక వుడుకుతున్న నూనె వలె కనిపిస్తున్నది. నీటిలో గాస్ కలుస్తున్నందున, అది కలుషితమై క్రూడ్ ఆయిల్ వలె మడ్డిగా వుంటున్నది. అందులో చేయి పెడితే చల్లగా వుంటుంది. అదే పురోహితుడు చేసే మహత్తు.

సంతాన ప్రాప్తి

గొడ్రాలు అంటే పాపిష్టిదానిగా చూచే సమాజం కనుక, పెళ్ళి అయిన ప్రతి స్త్రీ సంతానం కోరుకుంటుంది. ఎన్నాళ్ళకూ సంతానం కలుగకపోతే వైద్యపరీక్షలు చేయించుకొనే బదులు బాబాల దగ్గరకు పోతారు. మూఢనమ్మకాలకు ఇదొక పెద్ద నిదర్శనం బాబా చెప్పినట్లు చేస్తారు. లింగాలకు మొక్కుతారు.

కాలభైరవ రాయికి మొక్కితే పిల్లలు పుడతారని ఆంధ్రలో నమ్మకం వుంది. ఇలాంటివి ఇతర రాష్ట్రాల్లో వున్నాయి కూడా. చాలా మంది ఇది నిజం అని నమ్ముతారు. కొంతకాలంగా సంతానం లేనివారికి గర్భగుడిలో అర్ధరాత్రి పూజలు చేస్తే పిల్లలు పుట్టినట్లు చెబుతారు.

ఒక పూజారి కాలభైరవ గుడిని అంటిపెట్టుకొని, సంతానప్రాప్తి కలిగిస్తున్నాడనే వార్త విని హేతువాది ప్రేమానంద్ వెళ్ళాడు. డబ్బు సమర్పించుకొని, తనకు సంతానప్రాప్తి కలిగించమని వేడుకున్నాడు. వెంట స్నేహితుడి భార్యను తీసుకెళ్ళాడు. వీరు చెప్పినదంతా విన్న అనంతరం పూజారి పంచలోహపాత్రలో బియ్యం పోసి, కత్తి మధ్యలో పెట్టి, మంత్ర పఠనం చేసి,పాత్రను