పుట:Abaddhala veta revised.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనుగొన్న పర్ష్యా మంత్రి అద్భుత చర్యకు రాజు ఆకర్షితుడై, ఏం కావాలని కోరుకోమన్నాడట. 64 గడులకూ మొదటిగడికి ఒక గోధుమ గింజతో మొదలెట్టి, రెట్టింపు చేసుకుంటూ పోయి, 64వ గడికి ఎంత ధాన్యం వస్తే అంత యిప్పించమని మంత్రి అడిగాడట. అదేం కోరిక! డబ్బు, స్త్రీలు, భవనాలు, ఆస్తులు, అలాంటివి కోరుకోమన్నాడు రాజు. మంత్రి వినయంగా తానడిగింది యిప్పిస్తే చాలన్నాడట. సరేనని, లెక్క మొదలెడితే, మొదటి గడికి ఒక గోధుమ గింజ రెండవ గడికి రెండు, మూడో గడికి 4, అలా హెచ్చిస్తూ పోయారట. 64వ గడి వచ్చేసరికి రాజుగారి ధాన్యాగారం చాల లేదు సరిగదా, అప్పు పడి, రాజ్యం అప్పగించాల్సి వచ్చిందట.

ఈ ఉదాహరణకు శాగన్ పేర్కొని భారత దేశంలో కూడా లెక్కలు కనిపెట్టిన ఖ్యాతి ప్రస్తావించారు. ఆ లెక్కలు మన జనాభాకు అన్వయిస్తే ఎంత ముంచుక పోయే స్థితి వస్తుందో చూడమన్నారు.

వాతావరణ కాలుష్యాన్ని గురించి శాగన్ రాసింది మరీ ఆకర్షణీయంగా, హెచ్చరికగా బాగా వున్నది. ప్రపంచం యావత్తూ కాలుష్యానికి తోడ్పడుతుండగా అందులో అమెరికా 20 శాతం అందిస్తున్న విషయం గుర్తు చేశారు.

భూమికి 25 కిలో మీటర్లు ఎత్తులో వున్న ఓజోన్ పొరకు బెజ్జం పడింది. అంటార్కిటికా వద్ద తొలుత సైంటిస్టులు యిది కనుగొన్నారు. అయితే ఏమిటి? సూర్యరశ్మిలో వుండే అల్ట్రావైలేట్ కిరణాలు సూటిగా మన మీద పడతాయి. అది కాన్సర్ వంటి రోగాలకు దారితీస్తుంది. శరీరానికి వుండే రోగనిరోధకశక్తి పోతుంది. ఓజోన్ పొరకు బెజ్జం పడడానికి కారణం మనమే. క్లోరో ప్లూరో కార్బన్లు వాడటం వలన యీ ప్రమాదం ఏర్పడింది. మనం వాడే రిఫ్రిజిరేషన్, సెంట్లు, అనేక పరిశ్రమలలో వాడే స్ప్రేలు, ఇన్సులేషన్, సాల్వెంట్స్ లో యిది వున్నది. ఇందులో కణాలు ఆకాశంలో ఒజోన్ పొరలోని కణాల్ని ఎదుర్కొంటున్నాయి. అదే ప్రమాదం. భవిష్యత్తులో యీ ప్రమాదం యింకా పెరిగిపోతుంది. శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తే, తొలుత పారిశ్రామికులు నిరోధించారు. తరువాత ఒప్పుకొని, వీటి వాడకాన్ని తగ్గించడానికి అంగీకరించారు. పూర్తిగా వీటిని ఆపడానికి కొంత కాలం పట్టవచ్చు. కాని ఆపి తీరాలని, భవిష్యత్తు తరాల సంక్షేమకారుడుగా కార్ల్ శాగన్ స్పష్టం చేశారు. 'ఎ పీస్ ఆఫ్ స్కై యీజ్ మిస్సింగ్' అని ఈ అధ్యాయానికి చక్కగా శీర్షిక పెట్టారు.

సైన్స్ - మతం గురించి కార్ల్ శాగన్ చేసిన చర్చ ఉత్తేజ పూరితంగా, మానవ వాదంతో యిమిడివున్నది.

రాజ్యాధిపతులు, మతాధిపతులు ఏర్పరచిన సంయుక్త సమావేశాలు 1988 ఏప్రిల్ లో ఆక్స్ ఫర్డ్ లోనూ, 1990 జనవరిలో మాస్కోలోనూ జరిగాయి. అందులో పాల్గొన్న శాస్త్రజ్ఞుడుగా శాగన్ తన అనుభవాల్ని రాశారు. వాతావరణ కాలుష్యాన్ని ఆపి,భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత గురించి ఒక విజ్ఞప్తి చేయగా దానిపై మతాల వారు, రాజకీయ నాయకులు ఒడంబడికపై