పుట:Abaddhala veta revised.pdf/423

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జబ్బు వస్తే, డాక్టర్లు నయం చేయాలేగాని, ఉద్దేశాలు అంటగట్టరు. సైకియాట్రిలో ఉద్దేశాలు చుస్తున్నారు. ఒక 42 ఏళ్ళస్త్రీ తాగి, కారునడుపుతుండగా, పోలీసు పట్తుకొని వూపిరి పరీక్ష (తాగుడు నిర్ధారణకు) చేయబోగా ఆమె నిరాకరించింది. తన్నేసింది, అరిచింది. గొడవ చేసింది. కోర్టులో న్యాయమూర్తి ఎదుట చెబుతూ, బహిష్టుకు ముందు లక్షణాలుగా తన ప్రవర్తనను వివరించింది. కోర్టు ఆమెను వదిలేసింది! సాజ్ యిలాంటి ఉదాహరణలు యిస్తూ, నేరానికీ రోగానికీ తేడా చూడనప్పుడు యిలాంటి స్థితి వస్తుందన్నాడు.

సైకియాట్రి పేర్కొనే అనేక లక్షణాలు వ్యక్తిగత, ఆర్ధిక, చట్టబద్ధ, సామాజిక, రాజకీయరంగాలకు చెందినవని, వైద్యరంగంలోకి రానివనీ సాజ్ చూపారు.

సాజ్ వాదనలకు సమాధానం చెబితే, సైకియాట్రిస్టుల వృత్తు దెబ్బతింటుంది. ఆదాయం పోతుంది. కనుక వాదనకు దిగరు. శాస్త్రీయ వివరణకు పూనుకోరు. తమ పలుకుబడి వినియోగించి పెత్తనం చేస్తున్నారు.

ఆత్మ, మనస్సు, మోక్షం, నరకం దేవుడు, దయ్యం మొదలైనవి పురోహిత వర్గానికి ఆయువుపట్టు. వాటిని రుజువు చేయాల్సిన బాధ్యత వారికి లేదు. మనుషులు నమ్మినంతకాలం అవి వారి ఆయుధాలే.

మానసిక రోగం, మనోవికారం, ఉన్మత్తత,పిచ్చి యిత్యాదులు సైకియాట్రిస్టుల అస్త్రాలు. అవి రుజువుకు నిలబడతాయా లేదా అనేది వారికి పట్టదు. దీనిపై వారి వ్యాపారం సలక్షణంగా సాగిపోయినంతకాలం, జనం "పిచ్చి" వదలదు!

- మిసిమి మాసపత్రిక, ఆగష్టు-1997
బిలియన్స్ అండ్ బిలియన్స్

కార్ల్ శాగన్ రాసి, అచ్చుకాక పూర్వమే చనిపోయిన చివరి పుస్తకం బిలియన్స్ అండ్ బిలియన్స్ యిప్పుడు విడుదల చేశారు. ఆయన భార్య చివరి మాట జోడించి, పాఠకులను ద్రవింప జేసే మమత చూపారు. కార్ల్ శాగన్ మరణానంతరం ఆమె అందుకున్న లక్షలాది సానుభూతి లేఖలను బట్టి శాగన్ బ్రతికే వున్నాడని డ్రుయన్ రాశారు.

శాగన్ ఇతర పుస్తకాలవలె యీ చివరి గ్రంథం కూడా జీవితం, మరణం, భవిష్యత్తు గురించి రాయగా, విపరీతంగా జనాకర్షణ పొందుతున్నది. సైన్స్ ను, మానవాళికి సాంకేతిక రంగ ప్రమాదాలను, నివారణను శాగన్ అతి సున్నితంగా చర్చించి, మార్గాంతరాలను చూపడం యిందలి ప్రత్యేకత.

రెండవ అధ్యాయం ఎత్తుగడలోనే చదరంగం కథను స్వీకరించారు. తొలుత యిది