పుట:Abaddhala veta revised.pdf/421

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాడు. మెదడులో ఏభాగం ఎలా పనిచేస్తున్నదో, దానికి చికిత్స ఏమిటో మెదడు శాస్త్రం అధ్యయనం చేస్తున్నదని సాజ్ స్పష్టం చేశారు. కనుక "పిచ్చి" అనేది ఒక అంగానికి వచ్చే రోగంగా నిర్ధారించలేకపోయారని ఆయన అన్నారు.

ఆత్మ అనేది వున్నదనే భ్రమ కల్పించి దానికి చికిత్స నిమిత్తం వివిధ శిక్షలు సైతం విధించిన పురోహిత వర్గం ఎలా ప్రవర్తిస్తున్నదో, సైకియాట్రిస్టులు కూడా మానసికం పేరిట అలానే చేస్తున్నారన్నారు.

ఫ్రాయిడ్ మానసిక రోగాలకు మూలంగా స్వప్నాలను స్వీకరించాడు. అదొక శాస్త్రంగా పెంపొందించే ప్రయత్నం చేశాడు. ఆ భ్రమలో సైకో ఎనాలసిస్ రూపొందింది. నేడు అదంతా శాస్త్రీయం కాదని, రుజువుకు నిలవడం లేదని తెలిసేసరికి,అనేక చిలవలు పలవలుగా మార్పులు చేశారు. కాని సైకియాట్రిని మాత్రం వదలకుండా, 'మానసికచికిత్స' అంటూ కొనసాగిస్తున్నారు.

మనుషులు వివిధ రకాలుగా ప్రవర్తిస్తారు. అందులో మనకు యిష్టం లేనివాటికి "పిచ్చి", "ఉన్మత్తత" "మనోవికారం" అని పేరుపెట్టడం, మానసిక చికిత్స చేయాలనడం,బలవంతంగా ఆస్పత్రిలో చేర్చించడం-యివన్నీ సాజ్ అభ్యంతర పెడుతున్నారు. తనలో తాను నవ్వుకోవడం, ఏడ్వడం,రోడ్డు మీద పోతూ అలా ప్రవర్తించడం "పిచ్చి"గా వర్ణిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఎవరి జోలికీ రాకుండా, హానిచేయకుండా వున్నంతవరకూ, బలవంతంగా ఆస్పత్రి పాలు చేయడాన్ని కూడా సాజ్ ఆక్షేపిస్తున్నారు.

స్క్రూడ్రైవర్ అనే మత్తు పానీయం వుంది. ఓడ్కాలో నారింజరసం కలిపి, స్క్రూడ్రైవర్ అనే పేరు పెట్టారు. మరమేకులు విప్పడానికి మనం వాడే స్క్రూడ్రైవర్ వుంది. స్క్రూడ్రైవర్ తాగినప్పుడు మత్తెక్కి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తుంటే, స్క్రూడ్రైవర్ చెడిపోయిందని షాపుకు తీసుకెళ్ళి బాగుచేయమంటే ఎలా వుంటుంది? మానసిక చికిత్స కూడా అలాంటిదే అన్నారు సాజ్.

మానసిక రోగం అనేది ఉపమాలంకారం వంటిదనే తన సిద్ధాంతాన్ని 5వ అధ్యాయంలో సాజ్ సమర్ధించారు. ఒక విషయానికి మరోపేరు పెట్టి అలంకారంగా మనం వాడుతుంటాం. వాటిని సాగదీసి, నిజం అనుకుంటే చిక్కువస్తుంది. కాని సైకియాట్రి నేడు అలాగే చేస్తున్నది. ఫాదర్ అంటే తండ్రి. క్రైస్తవ ఫాదర్ అంటే పూజలు చేసే పురోహితుడు. నిజమైన తండ్రికీ క్రైస్తవ ఫాదర్ కూ వాడుకలో తేడా వుంది. రెండూ ఒకటే అనుకుంటే చిక్కు వస్తుంది.

అలాగే కొన్ని హాస్య ఉపమానాలుంటాయి. వాటిని విని నవ్వుకొని ఆనందించాలేగాని, తు.చ.తప్పకుండ స్వీకరిస్తే చిక్కువస్తుంది.

ఒక అమెరికా యాత్రికుడితో చైనా అధికారి యిలా అన్నాడు. ప్రపంచంలో అతిపెద్ద దేశం