పుట:Abaddhala veta revised.pdf/420

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మిత్రులకు మీద్వారా శుభాకాంక్షలు అందజేస్తున్నాను అన్నాడు. అదే చివరి ఉత్తరం. భద్రంగా జ్ఞాపికగా అట్టిపెట్టాను. వాషింగ్టన్ లో రెండు పర్యాయాలు శాగన్ ను కలిశాను. ఫోటో తీయించుకున్నాను. ఆయన వివాదాస్పద విషయాలు కూడా చాలా ఆహ్లాదంగా చెబుతారు.

CARL SAGAN:
The Demon-Haunted World, Science As a Candle in the Dark PP 457
1/8 Demmy 1996 $ 30, Random House, New York
- మిసిమి మాసపత్రిక,జూన్-1997
"పిచ్చి" అంటే

నీవు దేవుడితో మాట్లాడితే ప్రార్ధన అంటారు. దేవుడు నీతో మాట్లాడాడంటే పిచ్చి అంటారు. సుప్రసిద్ధ సైకియాట్రిస్టు థామస్ సాజ్ సూక్ష్మంగా చెప్పిన సత్యమిది.

ఇటీవల ఆయన గ్రంథం Insanity వెలువడింది. అందులో ఆయన కొన్ని మౌళికాంశాలు లేవనెత్తి, ప్రశ్నీంచి, వివరించారు. మనం అలవాటుగా మాట్లాడే అనేక సందర్భాలు ఎంత అసమంజసమో, అశాస్త్రీయమో చెప్పారు.

మానసిక రోగం అనేది ఉపమాలంకారం అని, పిచ్చి అనేది మిధ్య అని సాజ్ అంటుంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఏది పిచ్చో చెప్పమని ఆయన అడిగితే నోరు నొక్కుకోవాల్సివస్తుంది. అలాగే మానసిక రోగం అని అతిసులభంగా వాడేస్తుంటాం. మానసికం అంటే ఏమిటి అని సాజ్ ప్రశ్నిస్తే సమాధానానికి తన్నుకోవాల్సిందే. వీటన్నింటినీ ఆయన చాలా లోతుగా పరిశీలించాడు.

రోగాలు శరీరానికి వస్తాయి. వాటి లక్షణాలు పరిశీలించి, చికిత్స చేస్తారు.

ప్రవర్తన మనిషికి సంబంధించినది. ఇందులో నవ్వడం, ఏడ్వడం, కోపగించడం, అనురాగం, మొదలైనవి వుంటాయి.

అంతవరకూ అర్ధమైంది. మూడోది మానసికం. అక్కడే వచ్చింది చిక్కు. తత్వవేత్తలు మనస్సు గురించి చాలా రాశారు. కాని మానసిక రోగాల జోలికి పోలేదంటారు సాజ్. సైకియాట్రిస్టులు మనస్సు అంటే ఏమిటో చెప్పకుండానే మానసిక రోగాలకు చికిత్స చేస్తున్నారని సాజ్ అభ్యంతరపెట్టారు. మానసిక చికిత్స అనేది దేవతా వస్త్రాలతో పోల్చి, దేవతలూ లేరు, వస్త్రాలు లేవని సాజ్ చెప్పాడు.

కొందరు యిటీవల పిచ్చి అంటే, మెదడుకు వచ్చే రోగం అంటున్నారని, అలాగయితే మెదడు స్పష్టంగా శరీరంలో ఒక భాగం అనీ, దానికి నిర్దుష్టమైన శాస్త్రం, లక్షణాలు వున్నాయని