పుట:Abaddhala veta revised.pdf/417

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చర్చించారు. క్రైస్తవుల వలె ఇస్లాంకూడా పురుషుని సృష్టి ముందు జరిగిందని భావించారు. స్త్రీల పట్ల ఇస్లాం చాలా క్రూరంగా, హేయంగా ప్రవర్తించిన ఉదాహరణలు రచయిత చూపాడు.

స్త్రీ బహిస్టు సమయంలో ఖురాన్ తాకరాదు, కాబా చుట్టూ తిరగరాదు, ప్రార్ధన చేయరాదు, ఉపవాసం వుండరాదన్నారు. స్త్రీ పురుష అసమానత్వం ఖురాన్ లో నిర్దిష్టంగా వుంది (సురా 2.282) ఆస్తిహక్కులో కూడా అబ్బాయికి రెండు రెట్లు అమ్మాయికి ఒక భాగం చెందాలన్నారు.

రక్తపాతంతో కూడిన పగ సాధింపు ఇస్లాంలో పేర్కొన్నారు. (సురా 2.178) స్త్రీలకంటె పురుషులు వివేచనలో అధికులని ముస్లిం న్యాయవేత్తలు పేర్కొన్నారు.

ముస్లిం స్త్రీల ముసుగు వారి బానిసత్వానికి గృహ నిర్భంధానికి, తక్కువగా చూడడానికి నిదర్శనంగా నిలచింది. ముస్లిం స్త్రీలు అనేకదేశాలలో బయటకు వచ్చి, తమ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను వెళ్ళడిస్తున్నా, మొత్తం మీద ఇస్లాం వారిని చిన్న చూపు చూస్తూనే వుంది. రచయిత యీ రంగంలో సోదాహరణలతో వివరణ యిచ్చారు.

ఇస్లాం సాహిత్యంలో వైన్, స్త్రీలగురించి రమణీయమైన కవితలు సాహిత్యం యీ రచయితే ప్రస్తావించారు. వైన్ దైవదత్తమని మహమ్మద్ ఒక చోట ఖురాన్ లో ప్రస్తావించాడు. (16.69) మరొక చోట వైన్ నిషిద్ధం అని కూడా చెప్పాడు (5.92)

ప్రతి మతం ఆహార పానీయాలలో నిషేధాలు పాటించింది. హిందువులు, క్రైస్తవులు దీనికి మినహాయింపుకాదు. ముస్లింలు పందిని నిషేధించారు. చైనాలో ముస్లింలు పంది మాంసం తింటూనే, దానిని పోర్క్ అనకుండా, మటన్ అని సరిపెట్టుకుంటున్నారు. మొరాకోలో రహస్యంగా తింటున్నారు.

లైంగిక ఆచారాలలో పురుషాయితం, స్త్రీల పట్ల స్త్రీలు అనుసరించే రీతుల్ని కూడా రచయిత ప్రస్తావించారు. ముస్లిం కవుల కవితల్ని చూపారు.

మహమ్మద్: రచయిత ఒక అధ్యాయంలో మహమ్మద్ వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు. చరిత్రలో ఆయనగొప్ప వ్యక్తి అన్నారు. మక్కా కాలమంతటా మహమ్మద్ చిత్తశుద్ధితో ప్రవర్తించాడన్నారు. మదీనా కాలంలో మహమ్మద్ మారి పోయినట్లు చెప్పారు.

ముస్లింలకు తప్ప ఇతరులకు ముక్తిలేదని, మానవవాళికి యీ సందేశం అందించడానికి దైవం నిర్ణయించినట్లు చెప్పారు. ఇది పెద్ద భ్రమ అని రస్సెల్ ను ఉదహరిస్తూ రచయిత పేర్కొన్నారు.

ఖురాన్ దైవదత్తమనీ, అదే అంతిమ సత్యమనీ మహమ్మద్ చెప్పడంతో కొత్త భావాలకు, స్వేచ్ఛకు స్వస్తి పలికినట్లయిందని రచయిత స్పష్టంచేశారు.