పుట:Abaddhala veta revised.pdf/408

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భూమి ఏర్పడినప్పుడు చాలా వేడిగా వుంటూ, వాతావరణం లేకుండా సాగింది. క్రమేణా చల్లారి శిలలనుండి వచ్చిన గాస్ ద్వారా వాతావరణాన్ని యేర్పరచింది. అదీ ప్రాణానికి పనికొచ్చేది కాదు. అందులో ప్రాణవాయువులేదు, అప్పటి గాస్ లు అన్నీ మనకు హాని కలిగించేవే. హైడ్రోజన్ సల్ఫైడ్ (కుళ్ళిన కోడిగుడ్డు వాసన) భరించి జీవించగల ప్రాణులు వుండి వుండవచ్చు. ఆనాడు సముద్రాలలో ఇవి పెంపొందాయి. ఈ పరిణామ క్రమంలో ఆదిమదశ జీవులు హైడ్రోజన్ సల్ఫైడ్ స్వీకరించి, ఆక్సిజన్ వదలి వుండొచ్చు. అంతటితో వాతావరణం మారింది. నేడు మనము గమనిస్తున్న తీరులో ఈ వాతావరణము ఆరంభమై ఉన్నత జీవులకు అవకాశము లభించింది.

విశ్వం, మన సైన్సుకు తెలిసినంతలో, పెద్ద ప్రేలుడుతో ఆరంభమై, అతివేడిగా వుంటూ, విస్తరించే కొద్దీ చల్లారుతూ పరిణమిస్తున్నది. అయినా ఇంకా ఎన్నో సందేహాలు వస్తున్నాయి. సాపేక్షతా సిద్ధాంతం కొంతవరకు సమాధానం చెబుతుండగా, మరికొన్నిటికి క్వాంటం అస్థిరత సూత్రం జవాబిస్తున్నది.

విశ్వం పరిమితమనదీ, అవధులు లేనిది అని సాపేక్షతా సిద్ధాంతం పేర్కొటున్నది. విశ్వంలో నియమాలు వున్నాయి. ఇవి దేవుడు సృష్టించాడని సరిపెట్టుకున్నా, పరిణామంలో అవి సైన్స్ కు అవగాహన అవుతున్నాయి. దేవుడు తొలిదశలో ఇలంటి నియమాలు ఎందుకు సృష్టించాడనేది తెలియదన్నారు. మనకు అర్థంకాని రీతిలో నియమాలు ప్రారంభించిన దేవుడు వాటిని పరిణామంలో వాటంతత అవే పెంపొందేటట్లు ఎందుకు వదలేసినట్లు? సంఘటనలు అడ్డగోలుగా జరగడం లేదని సైన్స్ చెబుతున్నది. అందులో నియమం వుంది. అలాంటి నియమం తొలిదశకు వర్తించదా. తొలిదశలో ఎన్నో అవకాశాలుండగా, అందులో ఏదో ఒకటి ఎంపిక చేసి,విశ్వాన్ని ప్రారంభించారనుకుందాం. అలాంటి విశ్వం నుండి క్రమబద్ధమైన విశ్వం వచ్చింది. అవధులు లేని పరిమిత విశ్వానికి అది అంతం లేదు గనుక సృష్టికర్తకు చోటులేదని హాకింగ్ చెప్పాడు.

వృద్ధాప్యం రాకుండా!

కవల పిల్లల్లో ఒకరు భూమిపై వున్నారనుకోండి. అతడి పేరు పృధ్వి. మరొకరు ఆకాశంలో రాకెట్ లో కాంతివేగంతో ప్రయాణం చెస్తున్నాడనుకోండి. అతడి పేరు ఆకాశ్. ఒకరికొకరు కాంతి సంకేతాలు పంపించుకుంటూ వుంటారు. అవి చేరడానికి పట్టే సమయం గమనించాలి. దూరం ఎక్కువ అయ్యే కొద్దీ సంకేతాలు అందడం ఆలశ్యమౌతుంటుంది. చంద్రుడి వద్దకు ఆకాశ్ వెళ్ళాడనుకొండి. అక్కడినుండి పృధ్వికి సంకేతం ఒక్క సెకండ్ లో అందుతుంది. సూర్యుడి దగ్గరకు వెళ్ళాడనుకొండి. అక్కడినుండి ఆకాశ్ పంపే సంకేతం పృధ్వికి 8 నిమిషాలలో చేరుతుంది. సమీప నక్షత్రానికి వెళ్ళాడనుకోండి 4 సంవత్సరాలకు గాని ఆకాశ్ పంపిన సంకేతం పృధ్వికి చేరదు.

కాంతివేగానికి కొంచెం తక్కువగా ఆకాశ్ 10 కాంతి సంవత్సరాలు దూరం వెడితే, అతడి