పుట:Abaddhala veta revised.pdf/406

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మన సూర్యుడు కూడా నల్లని నక్షత్రంగా మున్ముందు మారతాడు. అందుకు చాలాకాలం పడుతుంది గనుక ప్రస్తుతం మనకంత దిగులు లేదంటాడు హాకిన్స్!

సూర్యునిచుట్టూ తిరిగే భూమి కూడా గురుత్వాకర్షణ తరంగాలను పుట్టిస్తుంది. దీని వలన క్రమేణా భూమికాస్తా సూర్యుని దగ్గరగా చేరుతుంది. ఆ తరువాత సూర్యుడిలోపడి స్థిరపడుతుంది. ఈ పరిభ్రమణంలో అటు సూర్యుడూ, ఇటు భూమి కోల్పోతున్న శక్తి చాలా స్వల్పం. సూర్యుడిలో భూమి పడిపోడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. భూమి తన పరిధిని స్వల్పంగా మారుస్తూ పోతుంటే రేడియో తరంగాల వంటి పల్సార్స్ ను విడుదల చేస్తుంటుందని గ్రహించారు. గురుత్వాకర్షణ కోల్పోయిన నక్షత్రాలు వేగంగా తిరిగి, నల్లని నక్షత్రాలుగా రూపొందుతాయి. కొంతకాలానికి అవి స్థిరపడతాయి.

బ్లాక్ హోల్స్ (నల్లనక్షత్రాలు) వున్నాయని 1971 నాటికి హాకింగ్స్ సిద్ధాంతీకరించాడు. ఆకాశం నుండి వచ్చే రేడియోతరంగ సంకేతాలను తొలుత (1967 వరకూ) మరో చోట మనుషులుండి పంపిస్తున్నారని తలపోశారు. తరువాత ఇది నిజం కాదని, యివి పల్సార్స్ అని, పరిభ్రమించే న్యూట్రాన్ నక్షత్రాలు పంపేవనీ తెలుసుకున్నారు. ఇంతకూ బ్లాక్ హోల్స్ ఉనికి గ్రహించేదెలా? రెండు నక్షత్రాలు పరస్పరం ఆకర్షించుకుంటున్నట్లు ఖగోళ శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. అలాగే వెలుగుతున్న నక్షత్రం ఒకటి వెలుగులేని నక్షత్రం పట్ల ఆకర్షితమై తిరుగుతున్నట్లు తెలుసుకున్నారు. ఇలాంటి బ్లాక్ హోల్ కు ఒకదానికి సైగ్నస్ ఎక్స్-1 అని పేరు పెట్టారు. ఇలాంటివి విశ్వంలో ఎన్నో వుంటాయని భావిస్తున్నారు.

బ్లాక్ హోల్స్ లో వేడి విపరీతంగా వుంటుంది. అవి చిన్నవైతే వాటి వేడి కూడా ఎక్కువే. చిన్న బ్లాక్ హోల్స్ ను కనిపెట్టడం కూడా సులభం అని హాకింగ్స్ భావించాడు.

బ్లాక్ హోల్ చుట్టూవున్న ప్రదేశంలో గురుత్వాకర్షణ ప్రభావం వుంటుంది. బ్లాక్ హోల్ లో ఏదో ఒక పదార్ధం ఆకర్షితమైనా, ఎంటోపీ పెరుగుతుంటుంది. బ్లాక్ హోల్స్ నుండి రేడియేషన్ వస్తుంది. స్థిరంగా వుండే బ్లాక్ హోల్స్ నుండి కూడా రేడియేషన్ బయటపడుతుంది. బ్లాక్ హోల్ నుండి ఏదీ రాదనుకుంటే,ఇలా రేడియేషన్ వస్తుందనటమేమిటి? బ్లాక్ హోల్ పరిసరాల నుండి అలా వస్తుందని హాకింగ్స్ చెప్పాడు. క్వాంటం సిద్ధాంతం పేర్కొన్న అస్థిరత్వ సూత్రం ఆధారంగా, బ్లాక్ హోల్ చుట్టూ వుండే ప్రదేశంలో శూన్యావస్థ లేదు. అక్కడ క్షేత్రంలో కొంత అస్థిరత్వ గురుత్వాకర్షణ, కాంతి కిరణాలున్నాయి. పరోక్ష ప్రభావాల వలన అలాంటి కిరణాలు వున్నాయని గ్రహించవచ్చు. ఈ పదార్ధ కణాలలో జంటలున్నప్పుడు ఒకటి పదార్ధకణంగానూ, పరొకటి పదార్ధ వ్యతిరేకకణంగానూ వుంటుంది. ఇందులో ఒకదానికి పాజిటివ్ శక్తి వుంటే,మరొకదానికి పరోకశక్తి వుంటుంది. పరోక్షశక్తి గలది తొందరగా హరించిపోతుంది. వాస్తవకణాలకు ప్రత్యక్షశక్తి వుంటుంది. రెండూ కలిస్తే పరస్పరం హరించిపోతాయి.