పుట:Abaddhala veta revised.pdf/397

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుంచించాయి. మతం చెప్పే విలువలన్నీ దైవం పేరిట నమ్మకాల్ని బోధించే విలువలే. మతం అమానుషం. సైన్స్ మానుషం. మతానికి దైవంపై నమ్మకం కీలక వ్యాపారం. సైన్స్ కేవలం మనిషికి ఉపకరించే ఆయుధం,విలువ.

సైన్స్ గురించి తెలియకుండా, అనేక నమ్మకాలను కూడా సైంటిఫిక్ అని ప్రచారం చేస్తున్నారు. అది వ్యాపార లక్షణం నమ్మేవారున్నంతకాలం, ప్రశ్నించకుండా గుడ్డిగా అనుసరించే వారున్నంత కాలం ఇలా మోసాలు, వ్యాపారాలు సాగిపోతూనే వుంటాయి. ప్రశ్నించడం,తెలుసుకోవడం యివన్నీ శ్రమతో కూడినవని, ఎవరినో నమ్ముకొని, పూజలు చేస్తూ వుంటే, ప్రశాంతంగా వుంటుందనేవారే ఎక్కువగా వున్నారు. మతస్తులకు వారే కావాలి. అలాంటివారు సైన్స్ ను యెప్పుడూ నిరుత్సాహపరుస్తారు. సైంటిఫిక్ మెథడును ప్రోత్సహించరు. సైంటిస్టులను వ్యతిరేకిస్తారు. అవసరమైతే హతమారుస్తారు. దైవం పేరిట, మతం పేరిట సైంటిస్టులను బలి యివ్వడానికి వారు వెనుకాడలేదు.

హేతువాదులు, మానవవాదులు యెప్పటికప్పుడు సైన్స్ లో జరుగుతున్న ఆధునిక పరిశోధనలు తెలుసుకుంటుండాలి.

నమ్మకాలు అనేక తీరులు. గుడ్డిగా నమ్మడం, పెద్దలు చెప్పారని. తల్లిదండ్రులు ఆచరిస్తున్నారని నమ్మేవారున్నారు. అలాగునే, వాదనతో, తర్కంతో, విచక్షణతో, ఆలోచన చేసి నమ్మేవారున్నారు. సైన్స్ యీ రెండో పద్ధతిని వాడుతుంది.

ప్రకృతిని తెలుసుకోడానికి,మన స్థానం అందులో గ్రహించడానికే సైన్స్ తర్కం ఉపయోగించాం. దీని వలన పూర్వీకులకు తెలియని అనేక విషయాలు తెలిశాయి. ఇలా తెలుసుకోడానికి కొందరు శాస్త్రజ్ఞులు శాస్త్రీయ పద్ధతిని, గణితాన్ని ఆయుధాలుగా ప్రయోగించారు. అట్లా తెలుసుకుటుంనప్పుడు, చిరకాలంగా మన మతాలు చెప్పినవి, పెద్దలు నమ్మినవి దోషపూరితాలని తేలింది.

మానవుడికి సైన్స్ ఎంతో ప్రాధాన్యతను తెచ్చిపెట్టింది. విశాల ప్రకృతిలో మానవుడి స్థానం. యెక్కడో ఒక మూలవున్నా, అతడి వివేచన, చైతన్యం వలన ఎనలేని ప్రాధాన్యత మనిషికి లభించింది. సైన్స్ అమానుషం అనడం తెలియకనే కోపర్నికస్ సైన్స్ లో విప్లవానికి నాంది పలికాడు. పరిణామవాదంతో డార్విన్, మనిషి గతాన్ని తెలుసుకునేటట్లు చేశాడు. ప్రకృతిని నిష్పాక్షికంగా చూచి తెలుసుకునే శక్తి సైన్స్ వలన లభించింది. ప్రకృతి నియమాలను భిన్నకోణాలనుండి మనిషి గ్రహిస్తున్నాడు.

అన్వేషణ అనంతం. సైన్స్ అందుకు తోడ్పడుతున్నది. అనుకోని సంఘటనలు ప్రకృతిలో జరుగుతుంటే, సైన్స్ వాటిని అన్వేషిస్తుంటుంది. ప్రకృతిలో నియమాల్ని చూచిన మానవుడు వాటిలో వచ్చే మార్పుల్ని అద్భుతాలుగా స్వీకరిస్తున్నాడు. అంతటితో ఆగి, పూజించక, అద్భుత సంఘటనల వెనుక కార్యకారణ సంబంధం అన్వేషిస్తున్నాడు.