పుట:Abaddhala veta revised.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏ ఉద్యోగమైనా, వృత్తి అయినా యిరువురూ చేయగలరు. ఈ విషయాలు చెప్పాలి. సులభంగా, సునిశితంగా, ఆకర్షణీయంగా చెబితే, ఎంత జటిలమైన శాస్త్రీయ విషయమైన పిల్లలు బాగా నేర్చుకుంటారు.

- హేతువాది, ఏప్రిల్ 2000
ఇప్పుడు వీస్తున్న సైన్స్ గాలి

సైన్స్ లేకుండా గడిపే జీవితం ఒకప్పుడు వుండేదేమో. నేడు ప్రత్యక్షంగా, పరోక్షంగా మనందర్నీ సైన్స్ ప్రభావితం చేస్తున్నది. సైంటిఫిక్ గా వుండడం అనేది మానవ విలువ. సైన్స్ అమానుషం కాదని తేలింది. సైన్స్ ప్రజాస్వామికం. స్వేచ్ఛకు గౌరవాన్నిస్తుంది. సైన్స్ సహకారాన్ని కోరుతుంది. మొండివాదాన్ని కాదంటుంది. నిరంతర అన్వేషణ కోరుకుంటుంది. దీనికి అంతం లేదు.

సైన్స్ మానవుడి శక్తివంతమైన ఆయుధం. దీని ఆధారంగా ఎంతో తెలుసుకొని పురోగమిస్తున్నాడు. ప్రపంచంలో ఏమూల ఎవరు తెలుసుకున్నా అచిరకాలంలోనే అది మానవులందరి సొత్తుగా మారుతుంది. సైన్స్ విశ్వజనీనం. అందులో గుత్తాధిపత్యం లేదు.

సైన్స్ లో ఎన్నో పరీక్షలు జరుగుతాయి. ఇవన్నీ రుజువుకోసం జరిగేవే. అనేక పద్ధతులు అవలంబించి, నిర్ధారణకు వస్తారు. కనుకనే సైంటిఫిక్ అనడానికి ఎంతో విలువ, గౌరవం, ఆదరణ లభిస్తుంది.

ప్రకృతే సైన్స్ కు పరిశోధనాలయం. అందులో భాగమే మనిషి. ప్రకృతిలో అన్నీ తెలుసుకోడానికి సైన్స్ క్రమేణా ప్రయత్నిస్తుంది. ఒకనాడు తెలియని విషయాలు నేడు తెలుస్తున్నాయి. ఇంకా ఎన్నో తెలియాలి. పరిశోధనలు, పరిశీలనలు నిరంతరం జరుగుతున్నాయి. వీటికి అంతం లేదు. ఇలా తెలుసుకుంటున్నప్పుడు, లోగడ మనం నమ్మినవి, ఎన్నో మారిపోవచ్చు. తల్లిదండ్రులు, సమాజంలో పెద్దలు, గుడిలో మతస్తులు, బడిలో ఉపాధ్యాయులు సంప్రదాయంగా చెప్పిన విషయాలు మార్చుకోవలసి వస్తుంది. సైన్స్ రుజువు చేసిన వాటికి విరుద్ధంగా నమ్మినవాటిని దూరంగా వుంచవలసి వస్తుంది. పిల్లలకు వాటిని చెప్పడం మానాల్సి వుంటుంది. ఇది బాధగా అనిపిస్తుంది అయినా తప్పదు.

చిన్న పిల్లలు అనేక ప్రశ్నలు వేస్తుంటారు. తల్లిదండ్రులు ఏమి చెబితే అది వారిపై ప్రభావాన్ని చూపుతుంది. గాఢంగా హత్తుక పోతుంది. కనుక మూఢనమ్మాకాలు పిల్లలకు చెప్పకూడదు. తల్లిదండ్రులకే సైన్స్ రానప్పుడు ఏంచేస్తారు? తమ పెద్దలు తమకు చెప్పిన వాటిని పిల్లలకు బోధిస్తుంటారు. అలా తరతరాలుగా, సంప్రదాయికంగా మూఢనమ్మకాలు, భయాలు అశాస్త్రీయ విషయాలు ప్రచారం అవుతుంటాయి. పిల్లల్లో నాటుకపోయిన యీ విషయాలు