పుట:Abaddhala veta revised.pdf/391

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భూమి చుట్టూ తిరుగుతాయనో అనుకున్నారు. సూర్యుని పరిధిలో వున్న మనం కేంద్ర స్థానంలో లేమని కోపర్నికస్ తేల్చి చెప్పాడు. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. మానవుడి మతపరమైన దైవపరమైన అహం దెబ్బతిన్నది. అయినా భూమి కదలనట్లుంటుంది. సూర్యుడు, చంద్రుడు మాత్రమే కదులుతున్నట్లనిపిస్తుంది.

కదలికను గురించి అధ్యయనం చేసిన న్యూటన్, ఏదో ఒక శక్తి వలన కదలిక జరుగుతుంటుందన్నాడు. గురుత్వాకర్షణ వలన యాపిల్ భూమిపై పడుతుంది. ఒక వస్తువును కొంత శక్తితో విసిరితే ఆ మేరకు అది వెళ్ళి, శక్తి అయిపోగానే ఆగిపోతుంది. న్యూటన్ చెప్పిన సిద్ధాంతాలలో గురుత్వాకర్షణ అతిముఖ్యమైనది. గ్రహాల చలనం కూడా వీటి ప్రకారం వివరించాడు. అయితే గురుత్వాకర్షణ కేవలం ఆకర్షిస్తుందే గాని, తిప్పికొట్టదు. విద్యుదయస్కాంతంలో ఆకర్షణ- తిప్పికొట్టడం రెండూ వున్నవి. న్యూటన్ సిద్ధాంతం వలన వచ్చిన చిక్కులు జేమ్స్ క్లర్క్ మాక్స్ వెల్ తీర్చాడు. క్షేత్రాన్ని కనుగొనడమే యిందుకు కారణం. ఆ తరువాత విద్యుదయస్కాంత తరంగాలు కనుగొని యింకా పురోగతి సాధించారు.

ఈధర్ లో భూమి పయనిస్తుందని న్యూటన్ నమ్మాడు. కాంతి కూడా ఈధర్ లో పరిమిత వేగంతో పయనిస్తుందని మాక్స్ వెల్ నమ్మాడు. ఈధర్ కొరకు పరిశోధనలు చేసి చూడగా అలంటిదేమీ లేదని మైకేల్ సన్ (1852-1931) మోర్లే (1838-1923) పరిశీలనలో తేలింది. ఈధర్ కనుగొనడానికి కాంతి కిరణాలను వాడారు. ఈధర్ వుంటే కాంతి కిరణాల పయనంలో తేడా రావాలి. ఏటవాలుగా కిరణాలను వెనక్కు, ముందుకు ప్రయోగించి చూచారు. ఇదెలాగంటే నదిలో ఒకరు ఆ ఒడ్డుకూ యీ ఒడ్డుకూ యీదారనుకోండి. అదే సమయంలో మరొకరు నదీ ప్రవాహానికి కొంతదూరం వాలుగా, కొంతదూరం ఎదురీదారనుకోండి. నదికి అడ్డంగా యీదిన వ్యక్తి అటూ యిటూ కూడా కొంతమేరకు ప్రవాహం వెంట పోతాడు గనుక సులభంగా యీదుతాడు. ఎదిరీదిన వ్యక్తి బాగా జాప్యం చేయక తప్పదు. ప్రవాహం అతన్ని ఆటంకపరుస్తుంది. అలాంటి తీరులో కాంతి కిరణాలను ప్రయోగిస్తే తేడా కనిపించలేదు. నదీ ప్రవాహం వలె విశ్వంలో ఈధర్ ప్రవాహం వుంటే కాంతికిరణాలలో తేడా వచ్చేదే. న్యూటన్ నమ్మిన ఈధర్ రుజువు కాలేదు. ఈధర్ లేదు గనుక ఎలాంటి రుజువూ దొరకలేదు. కదలకుండా వుండే విశ్వంలో ఖాళీ ప్రదేశం గుండా పయనించే పదార్ధావేగాన్ని కొలవగలమని యిన్నాళ్ళూ న్యూటన్ నమ్మినదంతా సరికాదని తేలిపోయింది.

ఏదో ఒక పదార్ధంతో పోల్చి చూచి మాత్రమే మరొక వస్తువు వేగాన్ని చూడగలమని, ఆల్బర్ట్ ఐన్ స్టీన్(1879-1955) తన ప్రత్యేక సాపేక్షతా సిద్ధాంతం ద్వారా చెప్పాడు. పోల్చకుండా కేవలం వేగం కనుగొనడం అసాధ్యం. ఐన్ స్టీన్ చెప్పిన కొత్త సిద్ధాంతం ప్రకారం కాంతివేగం ఎక్కడైనా ఒకటే. అంటే భూమిమీద వున్నా,చంద్రుడిమీద వున్నా, రాకెట్ లో పయనిస్తున్నా, ఎవరు కొలిచినా కాంతివేగం ఒకటే. న్యూటన్ చెప్పిన ప్రదేశం - కాలం దోషపూరితాలని, స్థిరమైన ప్రదేశం, కాలం