పుట:Abaddhala veta revised.pdf/390

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఇందులో ఏ ఒక్కటినీ కమ్యూనిస్టులు తమ సిద్ధాంత రీత్యా పరీక్షకు పెట్టలేదు. పైగా రుజువైన ఈ సిద్ధాంతాలను సోవియట్ యూనియన్ నిరాకరించింది. గతి తార్కిక`భౌతికవాదంతో సహా అన్నీ పోతాయనే దృష్టితో సాపేక్ష సిద్ధాంతాన్ని స్టాలిన్ చనిపోయేవరకూ సోవియట్ రష్యాలో ప్రవేశింపనివ్వలేదు. ఆధునిక జన్యుశాస్త్రాన్ని కూడా ఆమోదించని లైసెంకో చెప్పిన ప్రచార ధోరణిని బలపరిచారు. న్యూ క్వాంటమ్ సిద్ధాంతాన్ని కూడా స్టాలిన్ చనిపోయే వరకూ విమర్శిస్తూనే ఉన్నారు. ఇప్పుడుప్పుడే రుజువైన ఈ సిద్ధాంతాలను సోవియట్ యూనియన్ వంటి కమ్యూనిస్టు దేశాలు తప్పనిసరిగా ఆమోదిస్తున్నాయి. అయితే ఇన్నాళ్ళూలేని కొత్త జాడ్యం ఒకటి కమ్యూనిస్టు దేశాలలో ప్రబలుతున్నది. అతీంద్రియ శక్తులను నమ్మటం, చూపుతో ఇనుప పరికరాలను వంచటం వంటి అశాస్త్రీయ విధానాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ విధంగా మార్క్సిజంలో వేసిన అంచనాలు శాస్త్రీయ పద్ధతికి నిలబడవు గనుక వాటిని నిరాకరించవలసి వుంటుంది. అయితే మన కమ్యూనిస్టులు భారతదేశంలో సైన్సు జోలికి,ముఖ్యంగా శాస్త్రీయ పద్ధతికి పోవడం లేదు. తాము నమ్మిన సిద్ధాంతాలకు శాస్త్రీయ పద్ధతిని అన్వయించటం లేదు. మతపరమైన మూఢ నమ్మకాలకూ-మార్క్సిస్ట్ మూఢనమ్మకాలకూ తేడా లేదు. శాస్త్రీయ పద్ధతి దృష్ట్యా సైన్సు పేరిట జరుగుతున్న కొన్ని మోసాలను బయటపెట్టటానికి అమెరికాలో ఒక సంఘాన్ని ఏర్పరచి నిరంతర పరిశోధన చేస్తున్నారు. తప్పుడు వ్రాతలగుట్టును బయటపెడుతున్నారు. మనకు కూడా ఇలాంటివి చాలా అవసరం.

- హేతువాది, మే 1986
ఆధునిక సైన్స్ కొలత!
న్యూటన్ నుండి ఐన్ స్టీన్ వైపుకు

మనం నిత్యజీవితంలో ఆకాశం(ప్రదేశం),కాలం అనే మాటల్ని తరచు వాడుతుంటాం. తత్వంలోనూ యివి తరచు వస్తాయి. కాని సైన్స్ లో ప్రదేశానికి, కాలానికి అర్ధం వేరు. ఇన్నాళ్ళు న్యూటన్ ప్రపంచంలో అలవాటుపడిన మనం యిప్పుడు ఐన్ స్టీన్ విశ్వంలో అడుగుపెట్టాం. మన భావాలెన్నో మార్చుకోవలసి వస్తున్నది. ఖగోళశాస్త్ర పరిశోధనలు మన సంప్రదాయ ఆలోచనల్ని పూర్తిగా మార్చివేస్తున్నాయి. ఆధునిక భావాల ప్రభావాన్ని తెలుసుకునే ముందు మన సంప్రదాయ సైన్స్ ఏమి చెప్పిందో గమనిద్దాం.

న్యూటన్ గతిసూత్రాలను రూపొందిస్తూ ప్రదేశాన్ని కూడా ఒక ద్రవ్యంగా పరిగణించి, దాని ప్రభావం పదార్ధంపై వుంటుందన్నాడు. పదార్ధం వుంది, అది ప్రదేశంలో పయనిస్తుంది. ఈధర్ అనేది వుంది, పదార్ధం ఈధర్ లో పయనిస్తుంది, అన్నాడు.

కోపర్నికస్ కనుగొనే వరకూ భూమి నిలకడగా వుండేదనీ, సూర్యచంద్ర నక్షత్ర గ్రహాలన్నీ