పుట:Abaddhala veta revised.pdf/382

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

తరువాత దశలో క్వార్క్ లు, వ్యతిరేక క్వార్క్ లు బయలుదేరి పరస్పరం తారసిల్లి హరించిపోయాయి. పదార్ధానికి తొలిదశ ఈ క్వార్క్ మాత్రమే. అలా తారసిల్లగా అదనంగా వున్న క్వార్క్ ల వలన విశ్వపదార్ధం రూపొందింది. ఇందులోనే ఎలక్ట్రానులు, పార్టికల్స్ వున్నాయి. బిలియన్ క్వార్క్ లు ఢీకొంటే అదనంగా ఒక్క క్వార్క్ మిగిలి అలాంటివన్నీ కలసి పదార్ధంగా వచ్చాయి.

తరువాత దశలో విద్యుదయస్కాంతశక్తి ఆకర్షణ గలది విడిపోయి బయటపడింది. ఈ లక్షణం ఫొటాన్లలో వుంది.

చివరగా రేడియో యాక్టివ్ ఒకే చూపే వీక్ ఫోర్స్(అణుధార్మికశక్తి)విడివడింది. దీనివల్లనే సూర్యరశ్మి మనకు వస్తున్నది.

విశ్వం చల్లబడేకొద్దీ క్వార్క్ ల నుండి ప్రోటానులు, న్యూట్రాన్లు వచ్చాయి. ఇంకా చల్లబడగా అణువులు రూపొందాయి. అలావున్న విశ్వపరిణామంలో ఎక్కడబట్టినా శక్తి(ఎనర్జీ) ప్రాధాన్యతే వుండేది. పదార్ధ విజృంభణ ఆ తరువాతే వచ్చింది. చల్లదనం ఎక్కువ అవుతుంటే గురుత్వాకర్షణశక్తికి మూలంగా పదార్ధం ఆసరా యిచ్చింది. పదార్ధం ఘనీభవించి వివిధ రూపాలు దాల్చింది. పదార్ధంలో 99 శాతం అంధకారమయం అని మరచిపోరాదు.

విశ్వం విస్తరణ చల్లారుతుండడం సాగిపోగా పదార్ధంకు విద్యుదయస్కాంతశక్తి భిన్నమార్గాలు అవలంబించాయి. హైడ్రోజన్, హీలియం, లిథియం అణువులు ఏర్పడేటందుకు వీలుగా ఎలక్ట్రాన్లను నూక్లి వశపరచుకుంది. అప్పటినుండే విశ్వం కనిపించసాగింది. వెలుగు(ప్రోటాన్లు) యధేచ్ఛగా విహరించింది. విశ్వంలో వుండే ఈ ప్రోటాన్లనే మైక్రోవేవ్ రేడియేషన్ అంటున్నాం.

కోబ్ టెలిస్కోపు ద్వారా విశ్వంలో మైక్రోవేవ్ రేడియేషన్ అలల్ని పదార్ధం తొలుత ఏర్పడిననాటి స్థితిని చూడగలుగుతున్నారు.

పాలపుంతలు ఏర్పడడం, గురుత్వాకర్షణ వలన ఈ పరిస్థితి కొనసాగడం దీని వలన క్వాసార్లు, నక్షత్ర సముదాయాలు తలెత్తడం విశ్వపరిణామంగా పేర్కొన్నారు. విశ్వవిస్తరణ మాత్రం సాగిపోతూనే వుంది.

(ఖగోళశాస్త్రంలో ఈ పరిశోధనల వెనుక చాలా కృషి వుంది. హేతువాదులకు అర్ధం కావడానికి వీలుగా, సాధ్యమయినంత సులభంగా చెప్పే ప్రయత్నంలో ఆధునాతన విషయాల్ని యిలా అందిస్తుంటాం. అందులో ప్రతి చిన్న విషయానికి పెద్ద వివరణ కావాలి.)

- హేతువాది, ఏప్రిల్,మే,జూన్ 1994