పుట:Abaddhala veta revised.pdf/38

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విషయంలో జోస్యం చెప్పేవారు ఎన్నటికీ నిలబడరు. అనేక విషయాలు చెప్పినప్పుడు ఒక్కోసారి ఏదైనా తగలవచ్చు. అంతమాత్రాన జోస్యం నిజంకాదు. భవిష్యత్తు తెలుసుకోవాలని ప్రతివారికీ వుంటుంది. ఈ కోర్కెను తీర్చడానికి ముందుకువచ్చిన, జోస్యాలవారు అదొక వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఇందులో బాబాలు, మాతలు కూడా పుట్టుకొస్తున్నారు.

సినిమాలు యీ జోస్యపు కట్టుకథల్ని ప్రచారంలో పెడుతున్నాయి.

- వార్త, 27 జనవరి,2002
కదిలేది-కదిలించేదీ

చూపుతోనే దూరాన వున్న వస్తువులు కదులుతున్నాయి, బల్లమీద కప్పు, సాసర్ మెల్లగా జరుగుతున్నది. ఇది ఎక్కడోకాదు, దేవుడంటే నమ్మకం లేని నాస్తికదేశం సోవియట్ యూనియన్ లో జరిగింది. కనుక అతీత శక్తులున్నాయి.

ఇలాంటి వార్తలు హఠాత్తుగా అప్పుడప్పుడు ఏదో మూలనుండి వచ్చేసరికి నమ్మకస్తులు విజృంభిస్తారు. పత్రికలు ముందు వెనుక చూడకుండా ఆకర్షణీయంగా ఇలాంటి వార్తలు వేస్తాయి.దూరాన వున్న వస్తువుల్ని కదిలించడాన్ని 'సైకోకెనసిన్' అంటారు. వస్తువుల్నే కాదు, మనుషుల్ని సైతం మహాత్ములు ప్రభావితం చేస్తారంటారు. ఇరువురి మధ్య ఎలాంటి శక్తి సంబంధం లేకుండానే యిలా చేయడం ఎలా సాధ్యం?

మనోబలంతో వస్తువుల్ని కదిలించడం, మనుషుల్ని ప్రభావితం చేయడం గొప్పవింతగా, శక్తిగా చెబుతున్నారు. శాస్త్రీయ పరిశోధనకు గురిచేసిన అంశం సైకోకెనసిన్ దూరశక్తి అనే ఈ విధానంపై అమెరికా, యూరప్ లో పరిశోధనలు జరిపారు. చదరంగం ఆటలో పావుల్ని మనోబలంతో ప్రభావితం చేస్తామనే వారువున్నారు. జె.బి.రైన్ వీటిపై 30 ఏళ్ళ పాటు వివిధ పరిశోధనలు జరిపి, నిర్ధారణగా తేల్చలేకపోయాడు. బొమ్మ, బొరుసు వలె, పావులు కూడా కొన్నిసార్లు అనుకున్నట్లు పడతాయి. వీనిని గణాంక పద్దతిలో సగటు లెక్కలు అంటారు.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో శాన్ ఆంటోనియోలో హెల్మట్ స్మిట్ ఒక సంస్థ నెలకొల్పి మనోబలం మీద పరిశోధనలు జరిపాడు. రేడియో ధార్మిక శక్తి క్షీణించే రీతుల్ని గైగర్ కౌంటర్ విధానంలో చేస్తారు. అందులో ఎప్పుడు, ఎలా రేడియోధార్మిక శక్తి క్షీణిస్తుందో వూహించ వీల్లేకుండా జరుగుతుంది. కాని, సగటున ఎంత జరుగుతుందో అంచనావేస్తారు. అందుకు గైగర్ టెస్ట్ వుపకరిస్తుంది. న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్రిన్స్ టన్ యూనివర్శిటిలో రాబర్ట్ జాన్ పరిశోధన జరిపాడు. ఇతర దేశాలకు పరిశోధకుల్ని పంపించి కూడా యీ టెస్ట్ లు జరిపాడు. అయినా దూరశక్తి యింత వరకు శాస్త్రీయంగా నిర్మాణం కాలేదు. అయినా నమ్మేవారు నమ్ముతూనే