పుట:Abaddhala veta revised.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జపనీస్ అర్థంలో రే అంటే స్పిరిట్. రేకి అనగా ఆధ్యాత్మిక జీవశక్తి అని అర్థం. జీవన శక్తిని నడిపించే స్పిరిట్ అన్నమాట.

మికాఓ ఉసుయై(MIKAO USUI) 1802-1883-జపాన్ లో మత ఉద్యమం నడిపాడు. అతడు కనుగొన్నదే రేకి వైద్యం. మన రుషుల వలె, ప్రవక్తల వలె యితడికీ దివ్యవాణి వినపడడం, భ్రమలు కలగడం, అమ్నిషికి చికిత్స చేయడానికి యీ దివ్యవాణి అక్కరకు వస్తుందనడం అవసరమన్నాడు. మికాఓ తరచు ఉపవాస దీక్షలు చేసి, ఆ తరువాత తనకు దివ్యవాణి తెలిపిందంటూ బయట పెట్టేవాడు.

జీవశక్తిలో వడిదుడుకులు సంభవించినప్పుడు రోగాలు వస్తాయని రేకి సిద్ధాంతం విశ్వమంతటా శక్తి వ్యాపించి వుంది. దీనిని రేకి విధానం ప్రత్యేక శక్తితో కనుగొని, రోగికి ప్రసరింపజేస్తుంది. విశ్వంలోని శక్తిని సరైన మార్గంలో పెడితే రోగి కుదురుకుంటాడన్నమాట. విశ్వశక్తిని రోగి దగ్గరకు కేవలం రేకి డాక్టర్ మాత్రమే తేగలడు. విశ్వశక్తి తోడ్పాటుతో వ్యక్తిలోని శక్తి పెరిగి, రోగం నయమౌతుంది. ఆ విధంగా రోగిలోని శక్తిని సమపాళ్ళలో మళ్ళించడంతో వ్యక్తి స్వస్థత పొందుతాడు.

అయితే రేకి వలన రోగాలు తగ్గకపోతే? అందుకు కారణం రోగి విశ్వశక్తిని స్వీకరించకుండా నిరోధిస్తున్నాడన్నమాట! అంటే, రోగి పూర్తిగా రేకి డాక్టర్ కు లొంగిపోయి అతడు చెప్పింది వింటే, ఏ రోగమైనా తగ్గిపోతుంది. అన్ని రోగాలకు రేకి చికిత్స వుంది.

నేడు రేకి చికిత్స మూడు దశలలో నేర్పుతున్నారు. దీనికిగాను బాగా ఫీజులు వసూలు చెస్తున్నారు. మత పరిభాషను అడుగడుగునా రేకి చికిత్సలో ప్రయోగిస్తున్నారు. రేకి విధానంలో వివిధ దశలలో మత సంకేతాలు వాడతారు. ఉద్వేగరీతుల్ని యధాస్థితికి తెస్తామంటారు.

- నాస్తికయుగం, జూన్ 2001
జ్యోతిష్యం

చదువుకున్నవారు, డిగ్రీలున్నవారు చేతులు చూపించుకుంటున్నారు. ముహూర్తాలు పాటిస్తున్నారు. అర్ధరాత్రి పెండ్లిళ్లు చేస్తున్నారు. అధికారంలో వున్నవారు, రాజకీయాల్లో వున్నవారు ప్రతిదానికీ ముహుర్తాలు పాటిస్తున్నారు. ఎక్కడ చూచినా ఆస్తాన జ్యోతిష్యులు తయారయ్యారు.

"హిందు","ఈనాడు" వంటి పత్రికలు జ్యోతిష్యాన్ని ప్రచురించడంలేదు. కాని చాలా దినపత్రికలు వార, దిన ఫలాలు, రాశిచక్రాలు వేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యిది వున్నది. సుప్రసిద్ధ శాస్త్రజ్ఞులు విజ్ఞప్తి చేసినా, జ్యోతిష్యం శాస్త్రీయం కాదని తెలిపినా, అది కేవలం వినోదం అని ప్రకటించమన్నా, పత్రికలు మొండిగా పాఠకులను మోసం చేస్తున్నాయి. ఏ రెండు పత్రికలూ