పుట:Abaddhala veta revised.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైద్యం పెంపొందబట్టి, అంటురోగాలు, హృద్రోగాలు, అత్యవసర పరిస్థితిలో ఆదుకోవడం సాధ్యపడింది.

మన రాజ్యాంగం 51(ఎ) ప్రకారం శాస్త్రీయ ఆలోచన పెంపొందించడం మన విధిగా పేర్కొన్నది. అందుకు విరుద్ధంగా ప్రస్తుతం హోమియో వున్నది గనుకనే, శాస్త్రీయపద్ధతిలో సాగినట్లు రుజువుపరచమంటున్నాం.

- హేతువాది, నవంబర్ 1990
హోమియో అమానుషం:
అమెరికా హ్యూమనిస్టుల నిర్ధారణ

హోమియో శాస్త్రీయమని రుజువుపరచడానికి అమెరికా, యూరోప్ దేశాలలో తీవ్ర ప్రయత్నం చేశారు. ఈ విషయమై అమెరికా హ్యూమనిస్టులు నిపుణుల సంఘం వేశారు. హోమియో చిట్కా వైద్యమనీ, శాస్త్రీయంగా నిలబడదని తేలింది.

1988 జూలైలో ఫ్రాన్స్ లో ఇద్దరు శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల ద్వారా హోమియో శాస్త్రీయమని ప్రకటించారు. టైం, న్యూస్ వీక్ వంటి పత్రికలు సైతం విపరీతంగా ప్రచారం చేసిపెట్టాయి. ఇంకా ఆశ్చర్యమేమంటే, నేచర్ అనే సైన్సు పత్రిక యీ విషయంపై వ్యాసం ప్రచురించింది. హోమియోకు సైంటిఫిక్ స్థాయి రావడానికి అదే ఆధారం అన్నారు. పారిస్ వెలుపల ఇన్ సెమ్ (INSERM-The Institute National de la Santo et la Recherche Medicale)అనే పరిశోధనా సంస్థకు చెందిన 13 మంది సంతకాలు చేశారు. దీనికి నాయకత్వం వహించిన జాక్ బెన్ వెనిస్టె (Jacques Benveniste) అతనికి తోడుగా ఇజ్రాయిల్ ఆమె ఎలిజబెత్ డెవెనాస్(Elizabeth Davenas) కీలకపాత్ర వహించారు. పరిశోధనల వలన వడపోసిన నీటిలో యాంటిబాడీ కణాలను తొలగించినా, నీటిలో యాంటిబాడి రసాయనిక శక్తి "ఎలాగో" వున్నదన్నారు. అంటే నీటికి జ్ఞాపకశక్తి వుందన్నమాట. ఇదే వాస్తవమైతే హోమియో శాస్త్రీయమని రుజువైనట్లే. నేచర్ పత్రిక పరిశోధనా వ్యాసాన్ని ప్రచురిస్తూ (చూడు 333-సంపుటి పుట 816)ఇది నమ్మశక్యం కాకుండా వుందని వ్యాఖ్యానించింది.

బెన్ వెనిస్టి పరిశోధన ప్రకారం తాను వాడిన యాంటిబాడీ కణాలు నీళ్ళలో కలిపి, పలచబరచినా, ఇంకా 10120 మాత్రం లేకున్నా దాని శక్తివలన నయం చేస్తుందనీ హోమియో అంటుంది. బెన్ వెనిస్టి పరిశోధన ప్రకారం నీరు-"ఎలాగో జ్ఞాపకశక్తితో"-యాంటిబాడి లక్షణాలను కొనసాగిస్తుందన్నాడు. నీటిలో యాంటిసెరం కణాలు తొలగించినా, హైడ్రోజన్ అణువులు ఎలాగో ఓలాగ యాంటిబాడి చర్యను సాగిస్తుందన్నాడు. ఇదే