పుట:Abaddhala veta revised.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనదేశంలో సైంటిఫిక్ మెథడ్ అంటే ఏమిటో వివరించే బొమ్మల ప్రదర్శన ఒకటి డా॥ పి.ఎం.భార్గవ ఏర్పరచారు. అందులో శాస్త్రీయ, అశాస్త్రీయ పద్ధతుల ఉదాహరణలు పేర్కొంటూ, హోమియోను అశాస్త్రీయంగా ఉటంకించారు. ఎలా అశాస్త్రీయమో ఉత్తరోత్తరా వ్యాసాలు రాశారు, వివరించారు కూడా. శాస్త్రీయపద్ధతి అంటే ఏమిటో తెలిసిన పాశ్చాత్య హోమియో వైద్యులు శాస్త్రీయమని రుజువు చేయడానికి తిప్పలు పడుతున్నరేగాని, శాస్త్రీయ పద్ధతినే తిట్టడం లేదు. మనదేశంలో హోమియో శాస్త్రీయమని రుజువుపరచడానికి కంట్రోల్డ్ ఎక్స్ పరిమెంట్ జరగలేదు. ఎవరికో ఎందుకో తగ్గిందని కథలు చెబితే శాస్త్రీయ పరిశోధన కిందకు రాదు. అలాగైతే, హోమియో ద్వారా తగ్గనివారు, చనిపోయిన వారి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అప్పుడేమంటారు? మనదేశంలో హోమియో శాస్త్రీయమని రుజువుపరచే పరిశోధనలు ఎక్కడ ఎవరు ఎప్పుడు చేశారో చూపితే సరిపోతుంది గదా? పలుకుబడి చట్టాలు చేయించుకొని నిధులు సమకూర్చుకోవడం శాస్త్రీయతా?

శాస్త్రీయపద్ధతి అంటే?

శాస్త్రీయ పద్ధతి అంటే స్థూలంగా ప్రపంచవ్యాప్తంగా అంగీకారం వుంది. సమస్యకు సంబంధించిన సమాచారం లభించినంతమేరకు సేకరించడం, ఆ మేరకు విశ్లేషించడం, తద్వారా ప్రతిపాదనలు చేసి సిద్ధాంతీకరించడం, సిద్ధాంతాన్ని క్లిష్ట పరీక్షకు గురిచేయడం-ఇదీ వరుసక్రమం. పరీక్షకు నిలబడిన తరువాతనే ఆమోదిస్తారు. ఇలా రుజువైన సిద్ధాంతం ఇతరమైన రుజువైన సిద్ధాంతాలతో పొందికగా వుందో లేదో పేర్కొంటారు. కొత్త ఆధారాలు, వాస్తవాలు లభిస్తుంటే కొత్త సిద్ధాంతాలు ప్రతిపాదిస్తారు. ఈ విధంగా శాస్త్రజ్ఞానం నిత్యనూతనంగా గమనిస్తుంటుంది. ఫలానా శాస్త్రజ్ఞుడు చెప్పాడు గనుక అది తిరుగులేనిది అనే అధికారిక, పెత్తందారీ ప్రమాణాలు శాస్త్రీయ పద్ధతిలో వుండవు. ఒకసారి రుజువైన విషయం కొత్త ఆధారాలతో తృణీకరణకు గురైతే విచారించాల్సిన పనిలేదు. సెంటిమెంట్ కు తావులేదు.

రెండు సిద్ధాంతాల మధ్య పోటీ రావడం శాస్త్రీయ పద్ధతికి మామూలే. అప్పుడు క్లిష్ట పరిక్షకు ఏది నిలుస్తుందో చూచుకుంటారు. న్యూటన్, హూగిన్స్ సిద్ధాంతాల మధ్య ఇలాగే జరిగింది.

శాస్త్రీయ పద్ధతిలో రుజువు చేసిన తరువాత,ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా అలాంటి రుజువు మళ్ళీ చేయవచ్చు. హోమియో కూడా అలాగే రుజువుకు నిలబడితే సంతోషమే. రుజువు చేయడానికి ఒక శాస్త్రజ్ఞుల సంఘాన్ని నియమించమంటే, ఆగ్రహించి తిట్లకు, శాపాలకు దిగాల్సిన పనిలేదు.

మానవుడి ప్రాణం ఎంతో విలువ గలది. దీనితో చెలగాటం ఆడకూడదు. శాస్త్రీయపద్ధతిలో