పుట:Abaddhala veta revised.pdf/354

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
వికృతాకారాలు - వింత జీవులు

మనుషులు తోడేలువలె ప్రవవర్తించదం, అడవిలో జంతువులతో కలిసి హాయిగా బతకడం సినిమాలో చూశాం. నిజజీవితంలో యిలాంటివి సాధ్యమా?

కొందరు రాత్రిళ్ళు సంచరిస్తూ, మనుషులు రక్తం పీల్చి తమ ఆకలి తీర్చుకుంటారనీ భయానక కథలు వున్నాయి. మన పురాణాలలో, పవిత్రగంథ్రాలలో దేవుళ్ళు, రాక్షసులు, దేవతలు కొందరు ఎనిమిది చేతులతో, పన్నెండు తలలతో, మరికొందరు మూడోకన్నుతో, ఇంకొందరు సగం స్త్రీగా వున్నట్లు వర్ణనలువున్నయి. వినాయకుడి ఆకారం సంగతి సరేసరి. మానవాకారంలో వుంటూ కొన్ని వికృతాలుగల జీవులు అక్కడక్కడ తటస్థపడుతున్నయి. అందరివలెగాక వీరికి కొన్ని అంశాలు ఎక్కువో, తక్కువో వుంటాయి. అవే మామూలుగా కాక విపరీతంగా పెరుగుతాయి. వీరిని పాతాళలోవాసులనీ, అడవి మనుషులనీ రకరకాలుగా పిలుస్తారు. దయ్యాలుగా, పిశాచాలుగా కొందరు తలుస్తారు. వాంపైర్స్ నాగలోక కన్యలు అనే పిల్లలు కధల్లో వీరున్నరు.

వాంపైర్లపై పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. వీరి లక్షణాలలో చీకటి తప్ప వెలుగు చూడలేకపోవడం రక్తాన్ని పీల్చడం ప్రధానంగా చెబుతారు. పరపీడన పరాయణులుగా, అధికార దాహంతో యీ వాంపైర్లను చిత్రించారు. పూర్వం నుండే పుట్టుకలో వికృతాలు రావడానికి దగ్గరసంబంధాలు, మేనరికాలు, రక్తసంబంధాలు ఒక ప్రధాన కారణంగా చెబుతారు. తల్లి కొడుకు, తండ్రి కూతురు మధ్య లైంగిక సంబంధం, వివాహాలు నిషిధ్ధంగా వున్నయి . అలాగాక, రక్త సంబంధ వివాహాలు, సంపర్కంవల్ల వికృతాకారాలు పుట్టడం జరుగుతూనే వుంది.

జన్యుశాస్త్రం ప్రకారం పెళ్ళిళ్ళుబంధుత్వం లేనివారిని చేసుకుంటే మంచిది. ముఖ్యంగా రక్తసంబంధాలు వద్దంటున్నారు. వంశపారంపర్యంగా దగ్గర సంబంధాలవల్ల పోర్ఫిరియా అనే వ్యాధి వస్తున్నది. ఇది ప్రోటీన్ ఉత్పత్తిని అడ్డుకొంటున్నది. అలాంటప్పుడు పాలిపోయినట్లు అయిపోతారు. రక్తంలో హీమోగ్లోబిన్ సద్వినియోగం గాకపోవడం, ఆక్సిజన్ సరిగా వాడకపోవడం వల్ల యిలా జరుగుతుంది. చర్మ కింద పోర్పిరిన్ చేరుతుంది. ఇందుమూలంగా సూర్యకాంతిని చూడలేకపోవడం, వంటి నిండా పొడలు రావడం జరుగుతుంది. ఇది వాంపైర్ లక్షణం.

వాంపైర్లు చీకట్లో సంచరిస్తూ వెల్లుల్లి వాసన భరించలేకుండా వుంటారు. పోర్ఫియా బాధితుల లక్షణం అది. వెల్లుల్లిలో ఎంజైంలు పోర్ఫియా బాధితులలోలేని ప్రొటీన్లను అందిస్తాయి. కాని వెల్లుల్లి తిన్నా,వాసన చూసినా వాంపైర్ల చర్మం కంది,ఒక్కోసారి తీవ్ర వ్యాధికి గురౌతారు. పోర్ఫియా వ్యాధిగ్రస్తులలో పండ్ల గమ్స్ పోయి పండ్లు బయటకు పొడుచుకువస్తాయి. పోర్ఫియావ్యాధి వున్నవారికి రక్తప్రీతి వుండడానికి పోర్ఫిరిక్ రింగులు కట్టుగా వుండకపోవడమే. యవ్వనదశ వచ్చేసరికి వీరిలో ప్రోటీన్ కొరత బాగా బయట పడుతుంది. అలాంటప్పుడు వారికి పెళ్ళి అయితే పాలిపోవడం, రక్తం పీల్చడం, బాగా జరిగిపోతుంది. సహజంగా దీని చుట్టూ చాలా కథలు వ్యాపిస్తాయి.